తెలంగాణ

ఇంపాక్ట్ కార్యక్రమం విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (టిఎస్‌డబ్ల్యూఆర్‌ఇఐ) శనివారం నిర్వహించిన ఇంపాక్ట్ కార్యక్రమం విజవంతమైందని ఆ సొసైటీ కార్యదర్శి, ఐపిఎస్ అధికారి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 134 విద్యాసంస్థల నుంచి విద్యార్థుల తల్లిదండ్రులు ఇంపాక్ట్ కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు అవసరమైన విద్యాబోధన, వారు సమయానికి చేయాల్సిన పనులు వంటి వాటి విషయంలో వారిని ఉత్తేజితులను చేసేందుకు అవసరమైన మెళుకువలు తెలియజేసే ఉద్దేశ్యంతో ఇంపాక్ట్ నిర్వహించినట్లు తెలిపారు. తమ పిల్లల సైకాలజీని అర్ధం చేసుకుని రాబోయే విద్యా సంవత్సరానికి వారిని సమాయత్తం చేసేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు. అలాగే వేసవి సెలవులను వృధా చేయకుండా వారికి కొన్ని ప్రాజెక్టులను ఇవ్వడం జరిగిందని,వాటిని పిల్లలతో చేయించడం ద్వారా కొంత ప్రాక్టికల్ నాలెడ్జ్ వారికి వచ్చినట్లు అవుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు తాము ‘సమ్మర్ సమురాయ్’ని పేరు పెట్టినట్లు చెప్పారు.