తెలంగాణ

మెట్రో వాటర్ వర్క్స్‌కి హడ్కో అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్‌కి ప్రతిష్టాత్మక హడ్కో అవార్డు లభించింది. నగర ప్రాంతాల్లో వౌళిక వసతుల కల్పన, నిర్వహణకు గాను ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు హడ్కో వెల్లడించింది. అవార్డు రావడం పట్ల పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారకరామారావు హర్షం వ్యక్తం చేశారు. తాగునీరు, మురుగు నీటిపారుదల అభివృద్ధి విషయంలో నూతన టెక్నాలజీతో పాటు మరిన్ని వినూత్న పద్దతులు అనుసరించబోతున్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నాన్ రెవెన్యూ వాటర్‌ని 15 శాతానికి తగ్గించాలనే బృహత్తర లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. కాగా హడ్కో అందించబోయే అవార్డును మంత్రి కెటిఆర్ ఈ నెల 25న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో స్వీకరించనున్నారు. హడ్కో సంస్థ 46వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ అవార్డును ఢిల్లీలోని ఇండియా హబిటన్ సెంటర్‌లో మంత్రికి ప్రదానం చేయనున్నట్లు తెలిపింది.