తెలంగాణ

అమరవాయిలో అవస్థలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 23: ఓ పక్క కృష్ణానది..మరో పక్క తుంగభద్ర నది మధ్యలో నడిగడ్డ ప్రాంతంలోని అమరవాయి గ్రామాన్ని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యులు నంది ఎల్లయ్య ఎడాది క్రితం దత్తత గ్రామంగా ఎంపిక చేసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మల్దకల్ మండలం అమరవాయి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది పరచాలనే ఉద్దేశ్యంతో ఎంపి నంది ఎల్లయ్య ఈ గ్రామాన్ని దత్తతగా తీసుకున్నప్పటికి అభివృద్ది కార్యక్రమాలు మాత్రం కొనసాగడం లేదు. అదృష్టం ఏ గ్రామంలో లేని విధంగా ఈ గ్రామంలో మాత్రం మంచినీటి సమస్య పెద్దగా లేదని చెప్పవచ్చు. అయితే గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేని కారణంగా మురుగునీరు రోడ్లపై ఏరులై పారుతున్నాయి. కానీ దత్తత తీసుకుని ఎడాది దాటిన ఏ ఒక్క వీధిలో కూడా నూతనంగా డ్రైనేజీలు నిర్మించకపోవడం పట్ల ప్రజలు దత్తత గ్రామంపై పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. అదే విధంగా శిథిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంక్ ఎప్పుడు కూలుతుందొనని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు నంది ఎల్లయ్య రోడ్లు, డ్రైనేజీలపై దృష్టి పెడుతానని దత్తత తీసుకున్న తరువాత గ్రామానికి వచ్చి ఎడాది క్రితమే హామీలు కురిపించారు. తమ గ్రామాన్ని దత్తత తీసుకున్న ఎంపి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తారని ఆశలు పెట్టుకున్న గ్రామ ప్రజల ఆశలకు అనుగుణంగా పని చేయడంలేదనే విమర్శలు వెలువడుతున్నాయి. అయితే మరోపక్క ఎంపిలు తీసుకున్న దత్తత గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ఎంపి గ్రామాన్ని సందర్శించిన సందర్భంలో తెలిపారు. ఏది ఎమైనా గ్రామంలో మాత్రం దత్తత పనులు ఏమాత్రం కొనసాగడం లేదు.