తెలంగాణ

మొగుల్‌మడక.. అభివృద్ధి బాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 23: తెలంగాణ - కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో గల మారుమూల గ్రామం మొగుల్‌మడక గ్రామం. చదువులో వేళ్లపై లెక్కబెట్టే వారు ఉన్న గ్రామం. గ్రామానికి అధికారులుగానీ, ప్రజాప్రతినిధులు వెళ్తే జనం ఏం అడుగుతారనే భయం వెంటాడుతూ అధికారిక కార్యక్రమాలు జరిగితే ఎప్పుడు ముగించుకుని వెళ్లిపోదామనే తాపత్రేయం ఉండేది. అభివృద్దికి ఆమడదూరంలో, సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మహబూబ్‌నగర్ జిల్లా దామరగిద్ద మండలం మొగుల్‌మడక గ్రామాన్ని మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యులు జితేందర్‌రెడ్డి ధైర్యంతో దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకుని ఏడాది దాటింది. అయితే అభివృద్ది విషయంలో మాత్రం అంతంత మాత్రమనే చెప్పవచ్చు. ఎంపి జితేందర్‌రెడ్డి గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో కొంత అభివృద్ది పనులు ప్రారంభమయ్యాయి. ముందుగా గ్రామానికి రాకపోకల సౌకర్యం కల్పించడానికి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. అందులో భాగంగా సంబంధిత అధికారులతో సంప్రదించి మట్టి రోడ్లను బిటిరోడ్లుగా మార్చేందుకు శ్రీకారం చుట్టారు. రాకపోకలకు ప్రధాన సమస్యగా ఉన్న అన్నాసాగర్ - మొగుల్‌మడక లింక్ రోడ్డు పనులు రూ.1.50కోట్లతో కొనసాగుతున్నాయి. అంతేకాకుండా మొగుల్‌మడక-అంచన్‌పల్లికి వెళ్లే మట్టిరోడ్డును రూ .2.50కోట్లతో బిటి రోడ్డు పనులు ప్రస్తుతం వేగవంతంగా జరుగుతున్నాయి. మొగుల్‌మడక గ్రామం నుండి దేవర్‌పస్లబాద్ గ్రామానికి వెళ్లేందుకు రూ.87లక్షలతో నాలుగు కిలో మీటర్లు బిటి రోడ్డుతో పాటు ఒక కిలో మీటర్ గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణం పనులు పూర్తి అయ్యాయి. రూ.50లక్షలతో మొగుల్‌మడక నుండి నర్సపూర్ గ్రామానికి వెళ్లె మట్టి రోడ్డును బిటి రోడ్డుగా మార్చే పనులు చూరుకుగా కొనసాగుతున్నాయి. అంతేకాకుండా ఎంపి జితేందర్‌రెడ్డి సహకారంతో గ్రామంలో నెలకొన్న నీటి సమస్యను తీర్చేందుకు రెండు బోర్లను వేయించగా పుష్కలంగా నీళ్లు వచ్చాయి. దాంతో వాటర్ ప్లాంట్‌ను కూడా రూ.3లక్షల వ్యయంతో నిర్మించారు. త్వరలోనే ఎంపి జితేందర్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు సిద్దం చేశారు. శిథిలావస్థలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనం పక్కలోనే మరో నూతన భవనాన్ని రూ.13లక్షల వ్యయంతో నిర్మిస్తున్నారు. అదే విధంగా ప్రాథమిక పాఠశాల నూతన భవనం కూడా రూ.13లక్షలతో నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. అయితే ఇంకా గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్థవ్యస్థంగా ఉండటం, మురుగు నీరు రోడ్లపై పారుతుండటం జరుగుతుంది. ఎంపి జితేందర్‌రెడ్డి ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో ప్రత్యేకంగా 400 ఇళ్ల పరిసరా ప్రాంతాల్లో కూడా ఇంకుడు గుంతల కార్యక్రమం కూడా పూర్తి అయింది. బహీర్భూమికి వెళ్లకుండా ఉండేందుకు ప్రస్తుతం గ్రామంలో 30మరుగుదొడ్లను నిర్మించారు. 100శాతం మరుగుదొడ్లను నిర్మించేందుకు ప్రణాళికలను రచించారు.

అభివృద్ధి దిశగా గ్రామం
ఎంపి జితేందర్‌రెడ్డి తమ గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో మంజూరైన అభివృద్ది పనులతో పాటు నూతనంగా అభివృద్ది పనులు కొనసాగుతున్నాయి, ప్రస్తుతం గ్రామానికి సంబంధించిన లింక్‌రోడ్ల పెద్ద సమస్య పరిష్కారమైందని, మట్టి రోడ్ల స్థానాల్లో బిటిరోడ్డు పనులు కొనసాగుతున్నాయాని మొగుల్‌మడక సర్పంచ్ సావిత్రమ్మ తెలిపారు. వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తి అయిందని, త్వరలోనే ఎంపి చేతుల మీదుగా ప్రారంభించేందుకు సిద్దమైనట్లు ఆమె తెలిపారు. ప్రధానంగా నీటి సమస్య ఉందని, ఆ సమస్య నుండి ఎప్పుడు బయట పడుతామోనని ఎదురు చూస్తున్నామని తెలిపారు.
-సావిత్రమ్మ, సర్పంచ్