తెలంగాణ

‘ఎల్లంపల్లి’ ముంపు ముసుగులో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామగుండం, ఏప్రిల్ 23: తెలంగాణలోని కరీంనగర్ జిల్లా రామగుండంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామాల భూనిర్వాసిత కుటుంబాలకు అందజేసే పరిహారం చెల్లింపుల్లో పెద్ద ఎత్తున జరిగిన అవినీతి దందా బట్టబయలైంది. న్యాయంగా పొందాల్సిన పరిహారాన్ని ఇక్కడ నిర్వాసితుల ముసుగులో కాజేసిన కోట్ల రూపాయల పరిహారం వ్యవహారం రెవెన్యూ అధికారులు చేపట్టిన రీసర్వేలతో వెలుగులోకి వచ్చింది. ఈ రీసర్వేలో వెలుగు చూసిన 535 మంది అనర్హుల నిర్వాసితుల జాబితాను శనివారం సాయంత్రం రామగుండం మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామమైన వేంనూర్ పంచాయతీ కార్యాలయానికి అంటించారు. దీంతో గ్రామంలో దొంగ నిర్వాసితుల జాబితా వ్యవహారంపై గందరగోళం చెలరేగడంతో పాటు సంచలనానికి తెరలేపింది. ఊరువాడా అంతా కాజేసిన పరిహారం రికవరీ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది.
తీగలాగితే డొంకంతా కదిలినట్లు ముంపు గ్రామాల్లో నిర్వాసిత కుటుంబాలకు చెల్లించాల్సిన పరిహారం చెల్లింపుల కోసం ముంపు గ్రామాలకు చెందిన వారమని రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అసలు ముంపు గ్రామాల్లో నిజమైన నిర్వాసితుల కుటుంబాల వివరాలు ప్రత్యక్షంగా సేకరించేందుకు పెద్దపల్లి ఆర్‌డివో నారాయణ రెడ్డి ఆదేశాలతో రామగుండం తహసీల్దార్ గూడూరి శ్రీనివాస రావు నేతృత్వంలో మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామమైన వేంనూర్‌లో రెవెన్యూ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు. 1028 మంది నిర్వాసిత కుటుంబాలకు సంబంధించిన పరిహారాల చెల్లింపుల జాబితాను గ్రామంలో ప్రత్యక్షంగా ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహించారు. ఈ రీసర్వేలో రెవెన్యూ అధికారులకు దిమ్మతిరిగే నిజాలు బహిర్గతమయ్యాయి. ఇప్పటి వరకు వేంనూర్ ముంపు గ్రామం నుండి తాము నిర్వాసితులమని పరిహారం నొక్కేసిన వారంతా కూడా మెజారిటీగా స్థానికేతరులేనని తేలింది. కొందరు కరీంనగర్ ప్రాంతానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులని, మరికొందరు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారని..మరికొందరు 20 ఏళ్లుగా ముంబైలో నివాసముంటున్న వారు కూడా ఇక్కడ నిర్వాసితులుగా పరిహారం పొందినట్లు బయటపడింది. అనర్హులుగా గుర్తించిన నిర్వాసితుల జాబితాను రెవెన్యూ యంత్రాంగం బహిర్గతం చేయగా కాజేసిన పరిహారాన్ని సదరు వ్యక్తుల నుండి పరిహారం సొత్తును రికవరీ చేయడంతో పాటు వారిపై క్రిమినల్ చర్యలకు రెవెన్యూ యంత్రాంగం పెద్ద ఎత్తున కసరత్తులను ముమ్మరం చేసింది.