తెలంగాణ

జల్లు కురిసింది... నగరం మురిసింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 17: మధ్యాహ్నం రెండు గంటల వరకూ అదరగొట్టిన ఎండ...ఆ తర్వాత ఎటు పోయిందో ఏమో? అకస్మాత్తుగా వాతావరణం చల్లబడింది. చూస్తుండగానే సన్నటి చినుకులు మొదలై, భారీ వర్షంగా మారింది. అనుకోని ఈ హఠాత్పరిణామానికి రవ్వంత విస్తుపోయినా వర్షం తెచ్చిన ఆనందంతో నగరజీవి కేరింతలు కొట్టాడు. ఏదేమైతేనేం... నేల చల్లబడింది. రెండునెలలుగా మండుటెండల్లో మలమలమాడుతున్న నగరవాసుల మనసు కాస్తయినా కుదుటపడింది. భానుడి ప్రతాపానికి విలవిలలాడిన నగరవాసులపై వరుణుడు కరుణ చూపించాడు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. ఈదురు గాలులు తోడు కావడంతో పలు చోట్ల చెట్లు, సెల్ టవర్లు కూలిపోయాయి. 45 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకున్న ఎండలకు బెంబేలెత్తి, జనం రోడ్డుపైకి రావడానికే జంకుతున్న సమయంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడటం ఆశ్చర్యం కలిగించింది. పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురవగా, కొన్ని ప్రాంతాల్లో భారీగానే వర్షం కురిసింది.
గాలిలో తేమ శాతం పెరగడం వల్ల దక్షిణ, వాయవ్య ప్రాంతాల నుంచి వీస్తున్న గాలుల వల్ల వాతావరణంలో మార్పులు సంభవించి చిరుజల్లులు, ఉరుములతో కూడిన వానలు కురిశాయని వాతావరణ కేంద్రం డైరెక్టర్ వైకె రెడ్డి వివరించారు.
రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు. ఈదురు గాలుల బలంగా వీయడం వల్ల నగరంలో పలు ప్రాంతాల్లో హోర్డింగ్‌లు కూలిపోయాయి. దిల్‌సుఖ్‌నగర్ పి అండ్ టీ కాలనీలో ఈదురు గాలులకు చెట్టు కూలిపడటంతో నాలుగు బైక్‌లు దెబ్బతిన్నాయి. ఉప్పల్‌లో ఎగ్జిబిషన్ కోసం ఏర్పాటు చేసిన సెట్టింగ్ గాలికి పడిపోయింది. కరీంనగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం వల్ల మామిడి పంట దెబ్బతింది. అంబర్‌పేట, బోడుప్పల్, కాప్రాచ, చర్లపల్లి, ఇసిఐఎల్ తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. భారీ వర్షం వల్ల రాజీవ్ రహదారిపై చెట్లు కూలడంతో వాహనాల ప్రయాణానికి ఇబ్మందులు ఏర్పడ్డాయి. ఘట్‌కేసర్, మేడిపల్లి, బోడుప్పల్‌లో ఈదురు గాలులతో భారీగా వర్షం పడింది. గాలి దుమారం వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు. రంగారెడ్డి జిల్లా యాచారంలో ఒక మహిళ, కరీంనగర్ జిల్లా యశ్వంతరావుపేటలో చర్ల రాజయ్య ( 41) అనే వ్యక్తి పిడుగుపాటుకు మరణించారు.