తెలంగాణ

శ్రీరాంసాగర్ రెండో దశకు గోదారమ్మ దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఏప్రిల్ 3: కరవు, ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ జిల్లా రైతాంగానికి శ్రీరాం సాగర్ రెండవ దశతో గోదావరి జలాలు అందిస్తామంటు ఎన్నో మాటలు చెప్పి ఆశలు చూపిన పాలకులు ఆచరణలో మాత్రం జిల్లా బీడు భూముల్లో గోదావరి జలాలను పారించలేకపోతున్నారు. గోదారమ్మ తమ భూములను సస్యశ్యామలం చేస్తుందన్న పుట్టెడు ఆశలతో పుట్లు పండే భూములను కాలువలకు భూసేకరణ కింద ఇచ్చేస్తే నీరు పారని ఒట్టి కాలువలు తప్ప తమకు ఒరిగేందేమీ లేదంటు శ్రీరాంసాగర్ రైతులు వాపోతున్నారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు రెండో దశ ప్రధాన కాలువ కింద వరంగల్ జిల్లాలో 1,09,512 ఎకరాలు, ఖమ్మంలో 75,262 ఎకరాలు, నల్లగొండలో 2,13,175 ఎకరాలు మొత్తం 3,97,949 ఎకరాలకు గోదావరి నీరందించాలని లక్ష్యం. 2006లో 1043.14 కోట్ల అంచనా వ్యయంతో మొదలైన ప్రాజెక్టు ప్రధాన కాల్వ కింద నల్లగొండ జిల్లా పరిధిలో తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట, మిర్యాలగూడ, నకిరేకల్, ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల పరిధిలో 19 మండలాల్లోని 198 గ్రామాలకు సాగునీటి వసతి కల్పించాల్సివుంది. లక్ష్యం ఘనంగా ఉన్నా నేటికీ ఒక్క ఎకరాకు కూడా గోదావరి జలాలు అందడం లేదు. టిఆర్‌ఎస్ ప్రభుత్వమైనా రెండో దశ కాలువల సద్వినియోగం దిశగా తగిన చొరవ చూపుతుందనుకుంటే ఈ దిశగా నేటికీ కార్యాచరణ ప్రకటించలేదు. కాలువల్లో కంపచెట్లు, పిచ్చిమొక్కలు మొలవగా లైనింగ్‌లు దెబ్బతిని శిథిల కాల్వలను తలపిస్తున్నాయి. ప్రధాన కాకతీయ కాలువ 334 కిలోమీటర్ల నుండి 346 వరకు 12 కిలోమీటర్ల మేరకు ఉండగా కాలువను తవ్వి వదిలేశారు. దీని పరిధిలోని మూడు డిస్ట్రిబ్యూటరీలలో డిబిఎం 69 కాలువకు 77 కోట్లు ఖర్చు చేసి పనులు చివరి దశకు చేర్చారు. డిస్ట్రిబ్యూటరీ 70, డిస్ట్రిబ్యూటరీ 71 కింద ప్రధాన కాలువ, మైనర్లు, సబ్ మైనర్ల పనులకు 156 కోట్లు ఖర్చు చేశారు. అయితే ఆయా డిస్ట్రిబ్యూటర్లు, మైనర్ల నిర్మాణాలు నేటికీ అసంపూర్తిగా ఉండిపోగా కాలువల్లో నీరు పారడం అసాధ్యంగా మారింది. 2014-15 బడ్జెట్‌లో రెండోదశ పనుల పూర్తికి 15 కోట్లు కేటాయించగా 11.90 కోట్ల పనులు జరిగాయి. నల్లగొండ జిల్లా పరిధిలో 377.48 కోట్ల పనులకు 326 కోట్ల పనులు పూర్తి చేయగా మరో 51 కోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయి.
కాలువలకు చేరని గోదావరి జలాలు
శ్రీరాంసాగర్ రెండో దశ కింద నల్లగొండ జిల్లాకు గోదావరి జలాలు కలగా మారిపోయాయి. 2009లో ట్రయల్ రన్ పేరుతో, 2011 నుండి 2014 వరకు మధ్యలో నాలుగు పర్యాయాలు నీటి విడుదల చేసినా అవి ప్రధాన కాలువ నుండి డిస్ట్రిబ్యూటరీలకు అరకొరగా చేరడంతో ఇక మైనర్, సబ్‌మైనర్ కాలువలకు అవి అందలేదు. గతంలో ఒక పర్యాయం కొన్ని
చెరువల దరికి గోదారమ్మ చేరినా మళ్లీ జాడ లేకుండా పోయింది. కాలువల్లో నీరు పారక మైనర్, సబ్ మైనర్ కాలువలు అసంపూర్తిగా ఉండటం, లైనింగ్ అస్తవ్యస్తంగా జరుగగా పలుచోట్ల తూము, షట్టర్లు అప్పుడే శిధిలావస్థకు చేరాయి. తిరుమలగిరి మండల పరిధిలోనే తొమ్మిది కిలోమీటర్లు సాగే ప్రధాన కాలువ లైనింగ్ నాణ్యత లేని పనులతో లైనింగ్ దెబ్బతిని, గండ్లు పడి మరమ్మతుల పాలైంది. తుంగతుర్తి పరిధిలోని డిబిఎం-69 కాలువ పరిధిలోని సబ్ మైనర్ కాలువలు, జాజిరెడ్డిగూడెం మండలం డిబిఎం-71 కాలువ, మైనర్ కాలువల పనులు అస్తవ్యస్తంగా వదిలేశారు. తుంగతుర్తి శివారులోని డిబిఎం 70 కింద తొమ్మిది కిలోమీటర్ల కాలువ ప్రధాన కాలువ నుండి రుద్రమ చెరువుకు నిర్మించాల్సివుండగా ఇద్దరు గుత్తెదారులు మారినా 2006 నుండి నేటికీ పూర్తవ్వలేదు.

వలు, జాజిరెడ్డిగూడెం మండలం డిబిఎం-71 కాలువ, మైనర్ కాలువల పనులు అస్తవ్యస్తంగా వదిలేశారు. తుంగతుర్తి శివారులోని డిబిఎం 70 కింద తొమ్మిది కిలోమీటర్ల కాలువ ప్రధాన కాలువ నుండి రుద్రమ చెరువుకు నిర్మించాల్సివుండగా ఇద్దరు గుత్తెదారులు మారినా 2006 నుండి నేటికీ పూర్తవ్వలేదు.

కాంగ్రెస్ కారుకూతలకు అభివృద్ధే సమాధానం

రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్

కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 3: ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధే తెలియని తెలంగాణను ఎవరెస్టు స్థాయికి తీసుకెళ్ళేందుకు ప్రభుత వం చేస్తున్న కఠోర శ్రమను గుర్తించకుండా, వెకిలి వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ ప్రతినిధుల తీరు జుగుప్సాకరమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం కరీంనగర్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ‘వారి కారుకూతలకు రాష్ట్ర అభివృద్ధే తగి న సమాధానమని’ అన్నారు. ప్రధానంగా ప్రాజెక్టుల విషయంలో గతపాలకులు చేసిన తప్పిదాలను ఎత్తిచూపితే ప్రభుత్వంపై ఆరోపణలు చేయటం ఏమేరకు సమంజసమన్నారు. జలయజ్ఞం ప్రారంభించిన సమయంలో ప్రాజెక్టుల పూర్తికాలాన్ని విభజించి, ఇంజనీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ కన్‌స్ట్రక్షన్ (ఈపి సి) విధానంలో గుత్తేదారులకు అప్పగించి, దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రొక్యూర్‌మెంట్ అడ్వాన్స్‌లు ఇప్పించి,ఆ పార్టీనేతల జేబులు నింపిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన అనంతరం వీటికి చరమగీతం పాడి, సరికొత్త ప్రణాళికతో రాష్ట్రానికి తాగు, సాగునీరందించేందుకు ముందుకు నడుస్తోందన్నారు.