తెలంగాణ

మైనార్టీల అభివృద్ధికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఏప్రిల్ 3: టిఆర్‌ఎస్ సర్కార్ మైనార్టీల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తుందని, మైనార్టీల అభ్యున్నతికి ప్రణాళికాబద్దంగా కృషి చేస్తుందని డిప్యూ టీ సిఎం మహమూద్ అలీ స్పష్టం చేశారు. ఆదివారం మంత్రి హరీశ్‌రావు నివాసంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ 1200కోట్లు కేటాయించారన్నారు. గతంలో ఏ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి ఇన్ని నిధులు కేటాయించలేదన్నారు. ఉమ్మడి ఏపిలో 400కోట్లకు మించి ఏనాడు కేటాయించలేదన్నారు. తెలంగాణ వస్తే రాష్ట్రం ఆంధాకారమైతుందని అప్పటి సిఎంలు చంద్రబాబు, వైఎస్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారని, ఏడాదిలోగా ఏపిలో విలీనం చేస్తారని అపహస్యంగా మాట్లాడారన్నారు. కానీ సిఎం కెసిఆర్ పట్టువదలని విక్రమార్కునిలా విద్యుత్ మీద దృష్టి సారించి 24గం. విద్యుత్ అందిస్తున్నారన్నారు. గతంలో ఎండాకాలంలో 8గం. కోతలు ఉండేవని, నేతు కోతలు ఎత్తివేసి పరిశ్రమలకు సైతం 24గం. కరంట్ ఇస్తున్నామన్నారు. మైనార్టీలకు 70రెసిడెన్షియల్ పాఠశాలల కోసం 350కోట్లు కేటాయించారన్నారు. 120 రెసిడెన్షియల్ ఏర్పాటు చేయాల్సి ఉండగా జూన్‌లో 70 ప్రారంభిస్తామన్నారు. సిద్దిపేటలో బాలుర పాఠశాల ప్రారంభిస్తామని, అనంతరం మరో బాలికల పాఠశాల ఏర్పాటు చేస్తామన్నారు. ఫీజురియింబర్స్‌మెంట్ కోసం 685కోట్లు కేటాయించామన్నారు. మిషన్ భగీరథ కింద 1.50లక్షల కి.మీ పైపులైన్ వేస్తున్నామని, జూన్ 30నాటికి మొదటి విడత ఇంటింటా తాగునీరు అందిస్తామన్నారు.

సిద్దిపేటలో విలేఖరులతో మాట్లాడుతున్న డిప్యూటీ సిఎం మహమూద్ అలీ