తెలంగాణ

త్వరలోనే రాష్టవ్య్రాప్తంగా మార్చురీ అంబులెన్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి రూరల్, ఏప్రిల్ 3: త్వరలోనే రాష్టవ్య్రాప్తంగా మార్చురీ అంబులెన్సులు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని దేవునిపల్లి గ్రామంలో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక పాఠశాల అదనపు భవనం, ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ, గోదావరి జలాల పైప్‌లైన్లను ఆయన ప్రారంభిచారు. అనంతరం ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద ప్రజలు ఆసుపత్రిల్లో మరణిస్తే మృతదేహాన్ని వారి ఇంటి వద్దకు చేర్చడానికి ప్రభుత్వం మార్చురీ అంబులెన్సును ప్రారంభించనున్నట్లు తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రిల్లో పేదలందరికీ ఉచిత వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. దీని కోసం సిఎం కెసిఆర్ ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవిస్తే వెయ్యి రూపాయలు ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఇకనుండి గర్భిణిని ఇంటి నుండి ఆసుపత్రికి తీసుకురావడానికి ప్రత్యేక అంబులెన్సులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. క్యాన్సర్ వ్యాధితో చాలామంది చనిపోతున్నారని, సరైన సమయంలో వైద్యం అందక చాలామంది బాధపడుతున్నారని, ముందు జాగ్రత్త చర్యగా ఆసుపత్రిలో క్యాన్సర్ స్కీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఆర్‌బిఎస్ పథకం కింద విద్యార్థులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో నీటి సమస్య తలెత్తిందన్నారు.

దేవునిపల్లి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో
మాట్లాడుతున్న మంత్రి లక్ష్మారెడ్డి

ఉత్తర తెలంగాణలో మళ్లీ మావోల అలజడి?

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 3: ఉత్తర తెలంగాణలో మళ్లీ మావోల అలజడి మొదలైంది. మావోయిస్టుల ప్రాబ ల్యం గల ప్రాంతాల్లో రిక్రూట్‌మెంట్ చేపట్టినట్టు సమాచారం. కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లోని ఏజె న్సీ ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలు చాపకింద నీరులా సాగుతున్నట్టు తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటి నుంచి పార్టీ కొత్త రిక్రూట్‌మెంట్ చేపట్టిన నేపథ్యంలో పోలీసులు, మావోల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణలోకి ప్రవేశిస్తున్న మావోల అగ్ర నాయకత్వం పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందగా, ప్రతీకారంగా మావోయిస్టులు దంతెవాడ, భద్రాచలం సరిహద్దులో పోలీసులపై విరుచుకుపడ్డారు. మూడు రోజుల క్రితం మావోలు పేల్చి న మందుపాతరతో ఆరుగురు జవాన్లు మృతి చెందారు. తెలంగాణలో సాగర్, శృతి ఎన్‌కౌంటర్ తరువాత ఉత్తర తెలంగాణలో మావోలు తమ ప్రాబల్యం పెంచుకునేందుకు యత్నిస్తున్న తరుణంలో భద్రాచలంలో ఇద్దరు జిల్లా స్థాయి నాయకులు లొంగిపోవడం, మరొకరు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడంతో మావోయిస్టు పార్టీ తీవ్రంగా నష్టపోయింది. సెప్టెంబర్‌లో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుల నాటి నుంచి ఇప్పటి వరకు 18మంది మావోయిస్టులు మృతి చెందగా, ఎనిమిది మంది పోలీసులు హతమయ్యారు. మావోయిస్టులు, పోలీసులు ప్రతీకార చర్యలకు దిగడంతో ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లోని గిరిజన ప్రాంతాలు పోలీసుల కూంబింగ్‌తో భయాందోళనకు గురవుతున్నాయి. నక్సల్స్‌ను మట్టుబెట్టాలని పోలీసులు, పోలీసులపై ప్రతీకారానికి మావోయిస్టులు పరస్పర దాడులకు పూనుకోవడం గిరిజన ఏజెన్సీ ప్రాంతాలు బెంబేలెత్తుతున్నాయి. పోలీసుల విస్తృత సోదాలు, కూంబింగ్‌తో మారుమూల ప్రాంతాల ప్రజలు సమీప పట్టణాలకు వలస వెళ్తున్నట్టు తెలిసింది. పోలీసుల కూంబింగ్ ఓ వైపు, మావోయిస్టుల కార్యకలాపాలు మరోవైపు ఏజెన్సీ ప్రాంతాలను గడగడలాడిస్తున్నాయని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.