తెలంగాణ

అవినీతికి ఆలవాలం మిషన్ భగీరథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 3: తెలంగాణలో బిజెపి బలమైన శక్తిగా ఆవిర్భవించడానికి ప్రజలతో మమేకమై పనిచేయాలని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కార్యకర్తలకు సూచించారు. ఆదివారం కొంపల్లిలోని హైందవ నియంత్రణ్ కనె్వన్షన్ హాల్‌లో రాష్ట్ర బిజెపి కార్యవర్గ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు, తొందరపాటు చర్యలు, అమలుకు నోచుకోని పథకాలు, సాధ్యంకాని ప్రాజెక్టులు, నియంతృత్వ పోకడలతో రెండేళ్లు గడిపిందని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మించకుండా కాల్వలు తవ్వి జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చిన విధంగా ప్రస్తుత ప్రభుత్వం రిజర్వాయర్లు, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించకుండా మిషన్ భగీరథ పేరుతో పైపులైన్లు వేస్తూ అవినీతికి, అక్రమాలకు ఆస్కారం కలిగిస్తోందని విమర్శించారు. మిషన్‌కాకతీయ కార్యక్రమం ప్రచారంలో ఉన్నంత ఆర్భాటం పనులలో లేదని, ఆర్థికపరమైన అక్రమాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని, డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు ప్రచారమే తప్ప, నిర్మాణం ఎక్కడా ప్రారంభం కాలేదని, భూసేకరణ, నిధుల కేటాయింపు ఇంతవరకు జరగలేదని అన్నారు. కేంద్ర ఆర్థిక సంఘం ద్వారా వచ్చే నిధులను కూడా స్థానిక సంస్థలకు బదిలీ చేయకుండా దారి మళ్లించడమే కాకుండా విద్యుత్, తదితర బిల్లులను మినహాయించుకోవడం 73,74వ రాజ్యాంగ సవరణల స్ఫూర్తికే విరుద్ధమని కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో కరవు వికటాట్టహాసం చేస్తోందని, కరవు పరిస్థితి తీవ్రతను అంచనా వేయడంలో, కరవు పీడిత ప్రజలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. విశ్వవిద్యాలయాలను దేశ, జాతి వ్యతిరేక శక్తులకు అడ్డాలుగా మార్చడానికి కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర పార్టీ పిలుపుమేరకు బిజెపి శ్రేణులు ఏప్రిల్ 14 నుండి 24వ తేదీ వరకు సామాజిక సమరసత, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ వ్యవస్థ పటిష్టం వంటి అంశాలపై గ్రామగ్రామాన ప్రజలతో మమేకమై వారిని చైతన్యం చేసే దిశగా కేంద్రప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించాల్సిందిగా కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బిజెపి ఎమ్మెల్యేలు డాక్టర్ లక్ష్మణ్, ప్రభాకర్, ఎమ్మెల్సీ రాంచందర్, బిజెపి నేతలు మురళీధర్‌రావు, బద్దం బాల్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, దినేష్‌రెడ్డి, మల్లారెడ్డి, విజయలక్ష్మి పాల్గొన్నారు.

హైందవ నియంత్రణ్ కనె్వన్షన్ హాల్‌లో ఆదివారం జరిగిన
రాష్ట్ర బిజెపి కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

ఆర్థిక ఇబ్బందులు తాళలేక కడుపు తీపికి ఖరీదు కట్టిన తల్లి

రూ. వెయ్యకి అమ్ముతానంటూ రోడ్డెక్కిన వైనం
అడ్డుకున్న స్థానికులు
అంగన్‌వాడీకి అప్పగింత
ఇందూరు జిల్లాలో దారుణం

ఇందూర్, ఏప్రిల్ 3: నవమాసాలు మోసి, కనిపెంచిన మూడేళ్ల కుమారుడిని వేయి రూపాయలకు ఓ అభాగ్యురాలు విక్రయించేందుకు య త్నించిన సంఘటన ఆదివారం నిజా మాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేటలో జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకొన్న భర్త వదిలేసి వెళ్లడంతో ఆర్థిక ఇబ్బందులను తాళలేక తన కన్న కొడుకును అమ్మకానికి పెట్టానని సదరు మహిళ పేర్కొనడం పలువురి హృదయాలను ద్రవింపజేసింది. అయితే ఆమె ప్రయత్నాన్ని పసిగట్టిన గ్రామస్థులు స్థానిక సర్పంచ్‌కు సమాచారం అందించి, అతని ద్వారా బాలుడిని అంగన్‌వాడీ కార్యకర్తకు అప్పగించారు. నిజామాబాద్ నగరంలోని గాజుల్‌పేట్‌కు చెందిన వి.శైలజ, బోధన్‌కు చెందిన రాజు 11సంవత్సరాల క్రితం ప్రేమ వివా హం చేసుకున్నారు. వీరికి మొద టి సంతానంగా వి.నర్సింలు(5) జన్మించాడు. అయితే రెండవ కుమారుడైన బాలయ్య(3) గర్భంలో ఉన్న సమయంలో రాజు తన భార్య శైలజను వదిలేశాడు. అప్పటి నుండి ఆమె తన ఇద్దరు కుమారులతో నిజామాబాద్‌లోని పుట్టింటి వద్దే ఉంటోంది. పెళ్లైన కుమార్తెతో పాటు ఇద్దరు పిల్లలను పోషించడం వృద్ధులైన శైలజ తల్లిదండ్రులకు భారంగా మారింది. దీంతో కుమారుల పోషణ భారంగా మారినందున తన మూడేళ్ల వయస్సు గల చిన్న కుమారుడిని అమ్మకానికి పెట్టాలని శైలజ యోచించింది. శైలజ ఆదివారం నిజామాబాద్‌లోని తన పుట్టింటి నుండి చిన్న కుమారుడు బాలయ్యను చంకనెత్తుకుని బయలుదేరింది. ఆమె జానకంపేట గ్రామానికి చేరుకుని అయోమయంగా తిరుగుతుండడంతో పలువురు స్థానికులు ఆమె ప్రవర్తన పట్ల అనుమానించారు. శైలజ కొంతమందిని కలిసి తన కుమారుడిని కొంటారా? అని వాకబు చేయడాన్ని గమనించి నిలదీశారు. భర్త వదిలేసిన తాను ఇద్దరు కుమారులను పోషించే ఆర్థిక స్థోమత లేక ఇలా చేయాల్సి వస్తోందని కన్నీరు కార్చింది. స్థానికులు శైలజ వద్ద నుండి బాలుడిని తీసుకుని సర్పంచ్ దశరథ్‌కు అప్పగించారు. వెంటనే ఆయన ఐసిడిఎస్ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించినా, దాదాపు రెండు గంటల వరకు వారు జానకంపేటకు చేరుకోలేకపోయారు. దీంతో ఆ బాలుడిని అంగన్‌వాడీ కార్యకర్తలు సావిత్రి, పుష్పలకు అప్పగించారు. ఐసిడిఎస్ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ఈ సందర్భంగా సర్పంచ్ దశరథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమ్మకానికి పెట్టిన బాలుడిని సర్పంచ్ సమక్షంలో
అంగన్‌వాడీ కార్యకర్తలకు అప్పగిస్తున్న దృశ్యం