తెలంగాణ

మేటిగా ఐటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయకి చేరుతున్న ఐటీ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కొత్త పాలసీని ప్రకటించబోతోంది. ఒకవైపు ఆర్థిక
ప్రయోజనం, మరోవైపు యువతకు ఉపాధిని దృష్టిలో పెట్టుకుని పాలసీ రూపొందించారు. ఈ పాలసీని సిఎం కెసిఆర్ సోమవారం మధ్యాహ్నం విడుదల చేస్తున్నారు.

హైదరాబాద్, ఏప్రిల్ 3: విశ్వనగరమవుతున్న హైదరాబాద్‌లో ఐటీ మరింత విస్తరించేలా ప్రోత్సహిస్తూనే, ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటి అభివృద్ధికి అవసరమైన ప్రోత్సాహకాలు అందించాలన్నది ప్రభుత్వ యోచన. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ వంటి ప్రాంతాల్లో ఐటి కంపెనీలు ప్రారంభించే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఐటి పాలసీలో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అనంతరం తృతీయ శ్రేణి నగరాలకు సైతం ఐటి విస్తరించేలా చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఇప్పటి వరకు ఐటి కంపెనీలు హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాలకే పరిమితమయ్యాయి. నగరానికి నాలుగు వైపులా ఐటి కంపెనీలు విస్తరించడంతో పాటు తెలంగాణలోని ఇతర జిల్లా కేంద్రాల్లో సైతం ఐటి కంపెనీలు ప్రారంభించడానికి అవసరమైన ప్రోత్సాహకాలు పాలసీలో ప్రకటిస్తారు. పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడానికి వినూత్నంగా రూపొందించిన టిఎస్-ఐపాస్ తరహాలో ఐటి పాలసీ సైతం ఐటి కంపెనీలను ఆకట్టుకుంటుందని అధికారులు అంటున్నారు. సోమవారం మధ్యాహ్నాం 3 గంటలకు సిఎం కెసిఆర్ ఐటి పాలసీని ప్రకటిస్తారు. గవర్నర్ నరసింహాన్, ఇన్ఫోసిస్ నారాయణమూర్తితో పాటు పలు ఐటి కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారు. ఐటి రంగాన్ని తెలంగాణలో మరింతగా అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు పెంచేట్టు చేయడమే లక్ష్యంగా ఐటి పాలసీ రూపొందించారు. ఐటి రంగం అభివృద్ధి ద్వారా రాష్ట్ర ఆదాయం పెరగడంతో పాటు పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పన ద్వారా మేలు జరుగుతుందని భావిస్తున్నారు. దేశంలో ఐటి రంగంలో తెలంగాణ ప్రముఖ కేంద్రంగా మారింది. బెంగళూరు తరువాత హైదరాబాద్ ఐటి కేంద్రంగా మారింది. దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తెలంగాణ నుంచి ప్రస్తుతం 68వేల 258 కోట్ల రూపాయల ఎగుమతులు జరుగుతున్నాయి. అప్లికేషన్ల అభివృద్ధి మొదలుకొని ఐటిలో అనేక విభాగాల్లో హైదరాబాద్ కేంద్రంగా మారుతోంది.
దీనిని అవకాశంగా తీసుకుని మరింత అభివృద్ధి దిశగా ఐటి పాలసీని రూపొందించారు. మొత్తం నాలుగు రకాల కంపెనీలను గుర్తించారు. దేశీయ టెక్నాలజీ సర్వీసు కంపెనీలు, గ్లోబల్ ఇన్‌హౌస్ కేంద్రాలు, ప్రాసెస్, ఆపరేషన్లను ప్రధానంగా నిర్వహించే కంపెనీలు, పరిశోధన, అభివృద్ధి,టెక్నాలజీ కంపెనీలు. ఈ నాలుగు రకాల కంపెనీల అభివృద్ధికి పాలసీలో ప్రోత్సహకాలు ప్రకటిస్తారు.
కంపెనీలను ఆకట్టుకునే విధంగా వౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు , రోడ్లు, నీటి సరఫరా వంటి సౌకర్యాలు కల్పిస్తారు. ఐటి కంపెనీల లే ఔట్లకు విద్యుత్‌ను వెంటనే అందించడం చేస్తారు. వీటితో పాటు కంపెనీలకు మానవ వనరులు స్థానికంగానే లభించే విధంగా తగిన ఏర్పాట్లు చేస్తారు. ఇంగ్లీష్ భాషను బోధించే సదుపాయాలు కల్పిస్తారు. తక్కువ ఖర్చుతో నిర్వాహణ పనులు కొనసాగించే విధంగా కంపెనీలకు సౌకర్యాలు కల్పిస్తారు. ఐటి రంగంలో ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన మాంధ్యం ప్రభావం తెలంగాణపై సైతం కొంత వరకు పడింది. ఈ పరిస్థితి అదిగమించి ఐటి రంగం మరింతగా అభివృద్ధి చెందడానికి అవసరం అయిన ప్రోత్సాహకాలు అందించనున్నారు.
ఐటి పాలసీతో పాటు నాలుగు ఉప పాలసీలను కూడా విడుదల చేయనున్నారు. ఐటి, ఐటిఇఎస్, యానిమేషన్, గేమింగ్, డిజిటల్, ఎంటర్‌టైన్‌మెంట్, కమ్యూనికేషన్లు, ఎస్‌ఎమ్‌ఇలు, ఐటి హెచ్‌ఆర్, ఐటి వౌలిక సదుపాయాలు కల్పించే కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఐటి రంగం ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తోందని ప్రపంచ ప్రఖ్యాత ఐటి కంపెనీల ప్రతినిధులతో ప్రభుత్వ ప్రతినిధులు అభిప్రాయాలు తెలుసుకున్నారు. వీరి అభిప్రాయాల మేరకు ఐటి పాలసీ రూపకల్పన జరిగింది.
తెలంగాణలో గేమింగ్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు తెలంగాణలో తొలిసారి యానిమేషన్, గేమింగ్ పాలసీని ప్రకటిస్తారు. గేమింగ్, యానిమేషన్ రంగంలో అభివృద్ధి కోసం సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేస్తారు. ఐసిటి రంగంలో యానిమేషన్, గేమింగ్, వినోద భరితమైన ఆటలకు సంబంధించిన పరిశ్రమల అభివృద్ధికి మంచి అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
వరంగల్‌లో ఐటి కంపెనీలు, ప్లగ్ అండ్ ప్లే పద్దతిలో కార్యకలాపాలు కొనసాగించడానికి సదుపాయాలు కల్పించారు. టిఎస్‌ఐఐసి ద్వారా కంపెనీల కోసం వరంగల్‌లో 15వేల చదరపు అడుగుల స్థలాన్ని సమకూర్చారు. ఇక్కడ నిర్మాణాలు సాగుతున్నాయి.
ఐటి విధానం తెలంగాణలో ఐటి రంగం మరింత వేగంగా విస్తరించడానికి దోహదం చేస్తుందని అధికారులు చెబుతున్నారు.