తెలంగాణ

కోటి సాగు.. 10వేల కోట్లు ఖర్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 3: వివిధ ఎత్తిపోతల పథకాల ద్వారా కోటి ఎకరాలకు సాగునీటిని అందించాలని ప్రభుత్వం లక్ష్యాంగా పెట్టుకుంది. అనుకున్నట్టు ప్రాజెక్టులు పూర్తయితే కోటి ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ కోసం పదివేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు ప్రాజెక్టులు ఈ ఏడాదిలోనే పూర్తయ్యే అవకాశం ఉంది. రెండేళ్లలో కొన్ని ప్రాజెక్టులు ఐదేళ్లలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. చెప్పినట్టుగా ప్రాజెక్టులన్నీ పూర్తయితే ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ కోసం పదివేల కోట్ల ఖర్చవుతుంది. అయితే ప్రాజెక్టులు పూర్తయ్యేసరికి మూడు నుంచి ఐదేళ్ల కాలం పడుతుందని, విద్యుత్‌కు పదివేల కోట్లు వెచ్చించడం పెద్ద కష్టమేమీ కాదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయ. ప్రస్తుతం రాష్ట్రంలో 20లక్షల బోర్‌వెల్స్ పని చేస్తున్నాయి. వ్యవసాయ విద్యుత్‌కు ప్రభుత్వం ఏటా ఐదువేల కోట్లు చెల్లిస్తోంది. ప్రాజెక్టులు పూర్తయిన తరువాత కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తే ప్రస్తుతం బోర్ల ద్వారా సాగుతున్న వ్యవసాయం సైతం కాలువ ద్వారా సాగుతుంది. దీనివల్ల ప్రస్తుతం చెల్లిస్తున్న ఐదువేల కోట్ల విద్యుత్ సబ్సిడీ చెల్లించాల్సిన అవసరముండదు. ఎత్తిపోతలకు విద్యుత్ కోసం పదివేల కోట్ల వ్యయం అయినా వ్యవసాయ విద్యుత్‌కు చెల్లిస్తున్న ఐదువేల కోట్ల భారం తొలగిపోతుంది కాబట్టి నికరంగా మరో ఐదువేల కోట్ల భారం మాత్రమే భరించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో కోటి 60 లక్షల ఎకరాల భూమి ఉన్నట్టు అంచనా. అయితే దీనికి సంబంధించి సరైన లెక్కలు లేవు. కోటి 50 లక్షల ఎకరాల నుంచి కోటి 60 లక్షల ఎకరాల వరకు ఉండవచ్చునని ప్రభుత్వ వర్గాల అంచనా. భూమి ఎంత ఉందనే దానిపై ప్రభుత్వం వివరాలు సేకరిస్తోంది. ప్రస్తుతం చెరువులు, కాలువలు, ప్రాజెక్టులు, బోర్‌వెల్స్ అన్నీ కలిసి 20లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారు. ఐదేళ్లలో అదనంగా మరో 96లక్షల ఎకరాలు సాగులోకి వచ్చే విధంగా ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. పాలమూరు ఎత్తిపోతల, కాళేశ్వరం ప్రాజెక్టులు వీటిలో ప్రధానమైనవి. కోటి ఎకరాల లక్ష్యంలో సగం భారం ఈ రెండు ప్రాజెక్టులదే. ఈ రెండు ఎత్తి పోతల ప్రాజెక్టులకు విద్యుత్ అవసరం ఉంది. ఒకవైపు భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం వీటి కన్నా ముందే విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. 96, 500 కోట్ల రూపాయల వ్యయంతో దాదాపు 25వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవసరం అయిన ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా సాగుతోంది. ఏడాది క్రితమే ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పనులు ప్రారంభం అయ్యాయి. అవసరం అయిన అనుమతులు, నిధుల సమీకరణ, భూ సేకరణ వంటి కీలకమైన పనులు పూర్తయ్యాయి. భారీ నీటి పారుదల ప్రాజెక్టుల కన్నా ముందే విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తవుతుందని అధికార వర్గాలు తెలిపాయి.
ప్రాజెక్టులు నిర్మాణం ఎట్టి పరిస్థితిలోనూ పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. భూ సేకరణ ప్రధాన సమస్యగా ఉండేది. దీని కోసం జివో 123 విడుదల చేసి, భూ సేకరణలో స్థానిక ప్రజాప్రతినిధులు సైతం చురుకైన పాత్ర వహించేట్టు చేశారు. దీంతో భూ సేకరణ గతంలో కన్నా చాలా వేగంగా సాగుతోంది. ప్రాజెక్టులకు ఈ సంవత్సరం 25వేల కోట్ల కేటాయించారు. కేటాయించడమే కాదు ఖర్చు చేసి చూపిస్తామని అధికారులు చెబుతున్నారు. వచ్చే సంవత్సరం 30వేల కోట్లు కేటాయించి చూపిస్తామని ముఖ్యమంత్రి శాసన సభలోనే ప్రకటించారు.
5న సబ్ కమిటీ భేటీ
ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌పై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ మంగళవారం సమావేశం అవుతుంది. నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా ఉన్నారు. రీ డిజైనింగ్‌కు సంబంధించి, పనులకు సంబంధించి సత్వరం పూర్తి చేయడానికి ఈ సబ్ కమిటీ సమావేశం అవుతుంది. నిధుల మంజూరు, వ్యయంలో సమస్యలు తలెత్తకుండా ఆర్థిక శాఖ, నీటిపారుదల శాఖల మధ్య సమన్వయం కోసం సబ్ కమిటీలో ఆర్థిక మంత్రిని వేశారు. ప్రాజెక్టులకు సంబంధించిన పనులకు నిధుల విడుదలలో ఎలాంటి జాప్యం లేకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోనున్నారు. సబ్ కమిటీ సమావేశంలో ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు.