తెలంగాణ

ఆధ్యాత్మిక కేంద్రంగా తెలంగాణ తిరుమల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీర్కూర్, ఏప్రిల్ 2: బీర్కూర్ మండలం తిమ్మాపూర్‌లోని తెలంగాణ తిరుమల దేవాలయాన్ని గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఈ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున 10కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్టు ప్రకటించడమే కాకుండా, తన కుటుంబం తరఫున 10లక్షల 116రూపాయలను విరాళంగా అందిస్తున్నట్టు సభాముఖంగా అందరి హర్షధ్వానాల మధ్య సిఎం ప్రకటించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ శనివారం కుటుంబ సమేతంగా తిమ్మాపూర్‌లోని తెలంగాణ తిరుపతి ఆలయాన్ని దర్శించుకున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సుదర్శనయాగ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పచ్చని ప్రకృతి మధ్యన, ఆహ్లాదకర వాతావరణంలో ఉన్న ఈ ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. 398ఎకరాల ప్రభుత్వ భూమిని ఈ ఆలయానికే కేటాయిస్తామని, ఈ సువిశాల స్థలంలో అభయారణ్యం, కల్యాణ మండపం, కాటేజీలు, చిన్నారుల కోసం పార్కులను ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే ఇంజినీర్లు, ల్యాండ్‌స్కేపర్లను పంపించి సమగ్ర సర్వే జరిపిస్తామని అన్నారు. చిన్నజీయర్ స్వామి సూచనల మేరకు ఈ ఆలయానికి అవసరమైన సొబగులు అద్దుతూ, అద్వితీయ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ ఆలయ అభివృద్ధి బాధ్యతను తాను కూడా ఓ కార్యకర్తగా స్వీకరిస్తున్నానని పేర్కొన్నారు. తనకు తెలిసిన దాతల నుండి పెద్ద ఎత్తున విరాళాలు అందజేయిస్తానని చెప్పారు. దేవాలయాలు అంటే అవేమీ అతీతమైనవి కావని, తాము నమ్మే భగవంతుడిని కొలిచే సామూహిక వేదికలని సిఎం కెసిఆర్ అభిప్రాయపడ్డారు. మానవుల్లో సత్ప్రవర్తన, సన్మార్గంలో పయనింపజేసేందుకు ఆధ్యాత్మిక క్షేత్రాలు దోహదపడతాయన్నారు. మానవ సంబంధాల కోసం అనేక సిద్ధాంతాలు చెప్పవచ్చని, అయితే మనం నమ్మే భగవంతుడిని సేవిస్తే ఎంతగానో సంతృప్తి లభిస్తుందన్నారు. మన భారతదేశం ఎంతో గొప్ప సెక్యులర్ భావాలు కలిగిన దేశమని, అన్ని మతాల సారం ఒక్కటేనని కెసిఆర్ పేర్కొన్నారు. భగవద్గీత, ఖురాన్, బైబిల్‌లు ఏది పఠించినా, సంస్కారవంతంగా, పరస్పరం కలిసి జీవించాలనే బోధిస్తున్నాయని అన్నారు.

చిత్రం తెలంగాణ తిరుమల దేవస్థానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో
మాట్లాడుతున్న సిఎం కెసిఆర్