తెలంగాణ

అధ్యాపకురాలి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఏప్రిల్ 2: అదనపు కట్నం కోసం కాబోయే భర్త పెడుతు న్న వేధింపులు తట్టుకోలేక యువతి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లికి చెందిన పిజి లెక్చరర్ మమతా రెడ్డి (23) పెళ్లి కాకుండానే వరకట్న దాహానికి బలైంది. నిశ్చితార్థం జరిగిన తర్వాత అదనపు కట్నం కోసం వేధించడంతో లెక్చరర్‌గా పనిచేస్తు న్న మమతారెడ్డి ఆత్మహత్య చేసుకుంది. జిల్లాలోని కొత్తగూడెం మండలం ఎలుగుబల్లికి చెందిన వెంకటరమణ, ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లికి చెంది న మమతారెడ్డి నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పీజీ పూర్తి చేసిన మమత వరంగల్‌లో అధ్యాపకురాలిగా పని చేస్తుంటే, వెంకటరమణ తిరుపతిలో వైద్య విద్య అభ్యసిస్తున్నాడు. పెద్దల అంగీకారంతో గత ఏడాది నిశ్చితార్థం జరిగింది. అప్పటి నుంచి మమతకు కష్టాలు ప్రారంభమయ్యాయి. అదనంగా కట్నం ఇవ్వకపోతే మరో పెళ్లి చేసుకుంటానని వెంకటరమణ వేధించేవాడని మృతురాలి బంధువులు తెలిపారు. ఈ విషయంపై ఏటూరునాగారం సిఐ కిషోర్‌బాబు సమక్షంలో కూడా వారికి కౌనె్సలింగ్ జరిగింది. అయినప్పటికీ అతనిలో మార్పురాలేదు. ఎంత నచ్చచెప్పినా వినకపోవడంతో మమ త లోలోపల కుమిలిపోయేది. మారతాడని ఏడాది కాలంగా ఎదురుచూసినప్పటికీ వెంకటరమణలో మార్పు రాకపోవడంతో మనస్తాపానికి గురైంది.
మానసిక సంఘర్షణను తట్టుకోలేక గత నెల 31న పురుగుల మందు తాగగా ఎంజిఎం ఆసుపత్రి కి చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. పోస్టుమార్టం అనంతరం మమత మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కేసులో వెంకటరమణతోపాటు మరో ఐదుగురిపై ఏటూరునాగారం పోలీసులు కేసు నమో దు చేశారు.