తెలంగాణ

‘మినరల్ వాటర్’లో క్రిమినల్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 2: ఓవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ నల్లా కనెక్షన్ పథకంపై కసరత్తు చేస్తుండగా, మరోవైపు నగరంలో అక్రమ నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. టిఆర్‌ఎస్ ప్రభుత్వం జలమండలితో కలసి ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ కార్యక్రమం నేపథ్యంలో వాడకో ప్యూరిఫైడ్ వాటర్ బాటిళ్లు, క్యాన్‌ల యూనిట్లు వెలిశాయి. జంటనగరాల్లో ఎలాంటి అనుమతుల్లేకుండా మూడువేల వాటర్ ప్యాకింగ్ బాటిళ్లు, క్యాన్‌ల యూనిట్లను కనుగొన్నట్టు బిఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్) తెలిపింది. కాగా మూడు వేల యూనిట్లలో కేవలం 17 యూనిట్లు మాత్రమే ఐఎస్‌ఐ ముద్ర కలిగి, నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నాయని బిఐఎస్ తెలిపింది. ఇటీవల నగర శివారులోని రాంపల్లిలోని నీటి శుద్ధి కేంద్రాలపై దాడులు నిర్వహించామని, అక్రమంగా నీటి వ్యాపారం చేస్తున్న 11 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు. ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్‌లలో నాణ్యత లేదని, వాటర్ బాటిళ్లు, క్యాన్లలో స్టోర్ చేసి విక్రయించే నీటి వల్ల అనేక దుష్పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని సైంటిస్ట్ ప్రేమ్ సజని బిఐఎస్‌కు వివరించారు. బోర్‌వెల్ నీటినే మినరల్ వాటర్ పేరిట బాటిళ్లలో, క్యాన్‌లలో నింపి అమ్ముకుంటున్నారని, బాటిళ్లపై ప్రముఖ బ్యాండ్లతో లోగోలు, లేబుళ్లు అంటిస్తూ అక్రమంగా నీటి వ్యాపారం చేస్తున్నారని బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ తెలిపింది. ఈ విషయమై ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపిఎం) అధికారిని వివరణ కోరగా నీటి ప్లాంట్లపై దాడులు నిర్వహిస్తున్నామని నాణ్యతగల వాటర్ ప్లాంట్‌ల నీటిని మాత్రమే కొనుగోలు చేయాలని సూచిస్తున్నట్టు డిప్యూటీ చీఫ్ వాటర్ అనలిస్ట్ బి అంజనేయులు తెలిపారు.