తెలంగాణ

పాలవ్యాన్ ఢీకొని ముగ్గురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 2: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో శనివారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో బైక్‌ను పాల వ్యాన్ ఢీకొట్టింది. దాంతో దంపతులు మృతి చెందగా వారి ఐదేళ్ల బాలుడు సైతం ప్రమాదంలో మత్యువాత పడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించి మహబూబ్‌నగర్‌రూరల్ సిఐ రామకృష్ణ కథనం ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లా మద్దూర్ మండలం వీరారం గ్రామానికి చెందిన కొండయ్య (38), ఆయన భార్య శ్రీశైలమ్మ (30) వీరి ఐదేళ్ల బాలుడు నరేష్ హన్వాడ మండంల కిష్టంపల్లి గ్రామం నుండి బైక్‌పై వెళ్తుండగా మహబూబ్‌నగర్ పట్టణంలోని ఏనుగొండ దగ్గర ఉదయం ఏపి29.8729 నంబర్ గల పాలవ్యాను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సిఐ రామకృష్ణ వెల్లడించారు.

వడదెబ్బకు ఇద్దరు మృతి
కొత్తగూడెం రూరల్/చండ్రుగొండ, ఏప్రిల్ 2: ఖమ్మం జిల్లాలో ఎండ తీవ్రతకు జనం అల్లాడిపోతున్నారు. వృద్ధులు పండుటాకుల్లా రాలిపోతున్నారు. కొత్తగూడెం ఏరియాలో శనివారం ఒక్క రోజే ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. చండ్రుగొండ మండల పరిధిలోని బెండాలపాడు గ్రామానికి చెందిన వీరయ్య (65) శుక్రవారం ఉదయం చేను పనికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగివచ్చి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. రాత్రి దాటిన తరువాత పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు 108 వాహనంలో కొత్తగూడెం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. వీరయ్యకు భార్య వీరమ్మ, ఇద్దరు కుమారైలు, కుమారుడు ఉన్నారు. ఇదిలావుండగా కొత్తగూడెం రూరల్ మండల పరిధిలోని సింగభూపాలెం శివారు పాత అంజనాపురం గ్రామానికి చెందిన ఐతం రంగారెడ్డి (60) వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. బంధువులు ఆసుపత్రిలో చేర్చగా చికిత్సపొందుతూ మృతి చెందాడు.