తెలంగాణ

కోటి ఎకరాలకు నీరందిస్తే ప్రతిపక్షాలకు రాజకీయ భవిష్యత్తు ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, మార్చి 2: గోదావరి జలాలతో సాగునీటి ప్రాజెక్టులతో తెలంగాణలో కోటి ఎకరాలకు నీరందిస్తే కాంగ్రెస్, టిడిపి నేతలకు రాజకీయ భవిష్యత్తు ఉండదని విమర్శలకు దిగుతున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణలో కోటి ఎకరాలకు నీరు అందుతుందని కాంగ్రెస్, టిడిపి నేతలకు స్పష్టత ఉందన్నారు. ఆ కల సాకారమైతే కాంగ్రెస్, టిడిపి నేతలకు పుట్టగతులుండవని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. శనివారం మెదక్ జిల్లా సిద్దిపేటలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎంపి కొత్తప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మహిపాల్‌రెడ్డి, చింత ప్రభాకర్, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డిల తో కలసి మాట్లాడారు.
గోదావరి నీటి ప్రాజెక్టులు పూర్తి కావద్దని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, భట్టి విక్రమార్కలు అడ్డుపడే యత్నం చేస్తున్నారనేది వారి మాటలతోనే స్పష్టమవుతుందన్నారు. శాసన సభలో సిఎం కెసిఆర్ సాగునీటి ప్రాజెక్టులపై పవర్ ప్రజెంటేషన్ యావత్ దేశం, ఎన్‌ఆర్‌ఐలు, మేధావులు అభినందిస్తున్నారన్నారు. ఈ ప్రాజెక్టులతో రాజకీయ భవిష్యత్తు జలసమాధి అవుతుందని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. పవర్ ప్రజెంటేషన్, ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ సబబే అన్న విషయంపై మీడియాను సైతం తప్పుబట్టి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. తెలంగాణ ప్రాంతానికి కోటి ఎకరాలకు నీరు ఇవ్వటాన్ని, ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో స్పష్టం చేయాలన్నారు. తెలంగాణ అభివృద్ధితో రాజకీయ భవిష్యత్తు ఉండదని ప్రతిపక్షాలు తప్పుడు విమర్శలు చేయటం సమంజసం కాదన్నారు. ప్రతిపక్షాలు సంకుచిత భావంతో ఉండవద్దని.. తెలంగాణ భవిష్యత్తు కోసం ఆలోచించాలన్నారు. శాసనసభలో పవర్‌ప్రజెంటేషన్‌పై కాంగ్రెస్, టిడిపిల బండారం బయటపడుతుందని పారిపోయారని ఎద్దేవా చేశారు.

చిత్రం సిద్దిపేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు