తెలంగాణ

వడదెబ్బకు ఐదుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, వరంగల్, కరీంనగర్, సంగారెడ్డి, ఏప్రిల్ 1: ప్రచండ భానుడు విశ్వరూపం చూపుతున్నాడు. ఎండల తీవ్రతకు జనం ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో శుక్రవారం వడదెబ్బకు అస్వస్థతకు గురై ఐదుగురు మరణించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో నందిపాడుకు చెందిన సింగిశెట్టి నాగేశ్వరరావు (60) అనే దర్జీ వడదెబ్బకు గురై గురువారం రాత్రి మరణించాడు. ఇదే జిల్లా తిరుమలగిరి మండలపరిధిలోని తొండ గ్రామంలో శుక్రవారం గంధమళ్ల సీతరాములు (80) అనే వృద్దుడు వడదెబ్బకు అస్వస్థతకు లోనై మృతిచెందాడు. వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా కురవి మండలం రాజోలు గ్రామానికి చెందిన మక్కల కార్తీక్ (3) శుక్రవారం మృతిచెందాడు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని దేశరాజుపల్లి గ్రామానికి చెందిన గజ్జెల దుర్గయ్య (46) అనే కూలీ, మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం ఏదుల్లవాడలో ఎదుల్ల రాజయ్య (64) అనే గొర్రెల కాపరి ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురై మరణించారు.

ఇద్దరు రైతుల ఆత్మహత్య
కాగా, సిరిసిల్ల మండలం నర్సింహులపల్లెలో మహిమల కనకారెడ్డి (46) అనే రైతు అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరేసుకొని అతను ఉసురు తీసుకొన్నాడు. మెదక్ జిల్లా ములుగు మండలం మామిడ్యాల గ్రామానికి చెందిన కుర్మ నర్సింలు (35) తన పొలంలోనే చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

సంగీత దర్శకుడు
శశిప్రీతమ్‌పై దాడి
డబ్బు వివాదంలో స్నేహితుడి దురాగతం
పోలీసుల అదుపులో నిందితుడు భానుప్రసాద్
హైదరాబాద్/ గచ్చిబౌలి, ఏప్రిల్ 1: ప్రభుత్వానికి సంబంధించిన డాక్యుమెంటరీ డబ్బుల విషయంలో సినీ సంగీత దర్శకుడు శశిప్రీతమ్‌పై అతని స్నేహితుడు దాడి చేసిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శశిప్రీతమ్ అతని స్నేహితుడు భానుప్రసాద్ మాదాపూర్‌లోని కావూరి హిల్స్‌లో నివాసం ఉంటున్నారు. ఇద్దరు కలిసి ప్రభుత్వానికి సంబంధించిన ఒక డాక్యుమెంటరీ ఫిలిమ్‌ను చిత్రీకరించారు. దీనికి సంబంధించి డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. శుక్రవారం సాయంత్రం కావూరి హిల్స్‌లోని కార్యాలయం నుండి కారులో వెళ్తున్న శశిప్రీతమ్‌కు భానుప్రసాద్ ఎదురుపడ్డారు. డబ్బుల గురించి అడగగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భానుప్రసాద్ దాడి చేయడంతో శశిప్రీతమ్‌కు గాయాలయ్యాయి. డాక్యుమెంటరీకి సంబంధించి రూ. ఒక లక్షా 50వేలు తనకు చెల్లించాల్సి ఉందని, ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదని భానుప్రసాద్ ఫిర్యాదు చేశారు. శశిప్రీతమ్‌ను చికిత్స నిమిత్తం మాదాపూర్‌లోని మ్యాక్స్‌క్యూర్ ఆసుపత్రికి తరలించారు. భానుప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్న పొలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు.