తెలంగాణ

‘ట్విన్ టవర్స్’పై హైకోర్టు స్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 1: హైదరాబాద్ ప్రపంచ స్ధాయి ప్రమాణాలతో రాష్ట్రప్రభుత్వం నిర్మించ తలపెట్టిన కమాండ్ కంట్రోల్ పోలీస్ సెంటర్- ట్విన్ టవర్స్ నిర్మాణంపై హైకోర్టు స్టే ఇచ్చింది. కాగా సింగిల్ జడ్జ్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై వెంటనే ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు అపీల్ చేసింది. దాదాపు 16 నుంచి 24 అంతస్తుల వరకు హెలిపాడ్లతో కూడిన రెండు టవర్లను బంజరాహిల్స్ రోడ్ నంబర్ 12లో నిర్మించాలని, ఇక్కడ 600 వాహనాలు పార్కింగ్ చేసేందుకు సదుపాయాన్ని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. దీనికి సంబంధించిన డిజైన్‌ను ప్రభుత్వం ఆమోదించి ఎనిమిది ఎకరాల స్ధలాన్ని కూడా కేటాయించింది.
కాగా మీర్ అఫ్సర్ అలీ అనే వ్యక్తి సహా మరో 16మంది ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఎదుట పిటిషన్ దాఖలు చేశారు. ట్విన్ టవర్స్‌కు కేటాయించిన ఎనిమిది ఎకరాల్లో ఐదు ఎకరాలు తమ అధీనంలో ఉన్నాయని, తమ స్ధలంలో ట్విన్ టవర్లను ఎలా నిర్మిస్తారని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ ఐదు ఎకరాలను క్రమబద్ధీకరించాలని తాము 2007 ఏప్రిల్ 30వ తేదీన అప్పటి రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని కోరితే దరఖాస్తును తిరస్కరించారని వారు పేర్కొన్నారు. తమ స్ధలంలో ప్రభుత్వం భారీ నిర్మాణాలను చేపట్టడం అక్రమమని, హైకోర్టు గతంలో 2001, 2009లో ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టరాదని ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌ను సింగిల్ జడ్జి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు విచారించారు. వాదనలు విన్న తర్వాత హైకోర్టు స్టే మంజూరు చేసింది. రెండు వారాల పాటు కేసు విచారణను వాయిదావేసింది. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సింగిల్ జడ్జి స్టే మంజూరు చేయడంపై రాష్ట్రప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచి వద్ద అపీల్‌కు వెళ్లింది. పిటిషనర్లకు ట్విన్ టవర్ల నిర్మాణం తలపెట్టిన స్ధలం తమదేనని చెప్పేందుకు అవసరమైన చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లు, టైటిల్ లేవని రాష్ట్రప్రభుత్వం పేర్కొంది. భూమిని క్రమబద్ధీకరించేందుకు దరఖాస్తు చేసినంత మాత్రాన, ఆ భూమి పిటిషనర్‌దేనని భావించరాదని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది.