తెలంగాణ

25వేలమంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 29: తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో గత ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్న 25,589 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణ శాసన మండలిలో సభ్యులు కర్నె ప్రభాకార్, గంగాధర్‌గౌడ్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం పనిచేస్తోందని, అందులో భాగంగానే దాదాపు 25వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించటడంతో ప్రభుత్వంపై రూ.310 కోట్ల రూపాయల భారం పడుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కొనే్నళ్లుగా పనిచేస్తున్న 3840 మంది స్విపర్లను కూడా క్రబబద్దీకరించాలని సభ్యుడు పాతూరి సుధాకార్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్విపర్ల విషయంలో కూడా వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని ఈటల తెలిపారు. ఉర్దు అకాడమీలో పనిచేస్తున్న 186 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా క్రమబద్ధీకరించాలని తెలంగాణ శాసన మండలి ప్రతిపక్షనేత మహ్మద్ షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేసి పదవీ విరమణ చేసిన అధికారులను తిరిగి అదే స్థానంలో నియమించడంతో ప్రస్తు తం పనిచేస్తున్న అనేకమంది అధికారులు తీవ్రంగా నష్టపోవడంతోపాటు వారు పదవి విరమణ పోందే వరకు ప్రమోషన్ రావడంలేదని సభలో ఆర్థిక మంత్రి దృష్టికి సభ్యుడు ఎంఎస్ ప్రభాకార్‌రావు తీసుకు వచ్చారు. వెంటనే ప్రభుత్వ తగిన నిర్ణయం తీసుకుని రిటైర్డైన అధికారులకు తిరిగి పదవి కల్పించవద్దని ఆయన డిమాండ్ చేశారు. నూతన అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటు, రాజీవ్ స్వగృహ ఇళ్ల నిర్మాణం, బలహీన వర్గాలకు ఇళ్ల నిర్మాణంతోపాటు వివిధ ప్రశ్నలకు మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి సమాధానాలిచ్చారు.