తెలంగాణ

వ్యాపారుల ఒత్తిడి తట్టుకోలేకే అదృశ్యమయ్యా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, మార్చి 29: వస్త్ర ఉత్పత్తి రంగంలో సరయిన గిట్టుబాటు ధర లేక రూ 23 లక్షల మేర అప్పుల పాలయ్యానని గత నెల రోజులుగా అదృశ్యమైన సిరిసిల్ల పవర్‌లూమ్ ఆసామి రవీందర్ చెప్పారు. అప్పులిచ్చిన వాళ్లు ఇంటికి వచ్చి తీఅవమైన ఒత్తిడి చెచ్చారని, ఈ స్థితిలో ఏం చేయాలో దిక్కు తోచక ఆత్మహత్య చేసుకుందామనే నిర్ణయానికి వచ్చి కుటుంబ సభ్యులకు ఫోన్‌ద్వారా సమాచారం ఇచ్చానని చెప్పారు. అప్పులు చెల్లించాలన్న బడా వస్త్ర వ్యాపారుల వేధింపులు తాళలేక, మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఫోన్ సందేశాలు పంపి అదృశ్యమైన పవర్‌లూం ఆసామి మంత్రి రవీందర్‌ను పోలీసులు మంగళవారం రాత్రి విలేఖరుల ముందు హాజరు పర్చారు. సిరిసిల్ల పోలీసుల బృందం వరంగల్, ఖమ్మం జిల్లాలలో గాలింపులు జరిగి స్థానిక పోలీసుల సహకారంతో మంగళవారం భద్రాచలంలో ఒక లాడ్జిలో ఉన్న రవీందర్‌ను స్థానిక పోలీసుల సాయంతో పట్టుకున్నట్లు డిఎస్పీ పి సుధాకర్ చెప్పారు. అనంతరం సిరిసిల్లకు తరలించి రవీందర్‌ను విలేఖరుల ముందు హాజరు పర్చారు. ఈ సందర్భంగా డిఎస్పీ వివరాలను వెల్లడిస్తూ రవిందర్ సెల్ కార్డ్ డేటా ఆధారంగా లొకేషన్‌ను గుర్తించి పట్టుకున్నామన్నారు. అంతకు ముందు ఇతడి పరిస్థితిని వివరిస్తూ మంత్రి కె.తారకరామారావుకు వాట్సప్ సందేశాలతో తాను చనిపోతున్నట్టు తెలపడంతో తాము సోమవారం అధికారులతో కలిసి అతడి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ చేశామన్నారు. దాని తరువాత తాను చనిపోతున్నట్టు కుటుంబ సభ్యులకు మళ్ళీ ఫోన్ చేయడంతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వరంగల్, ఖమ్మం జిల్లాలతో గాలింపులు చేపట్టామన్నారు. ఇక నుండి రవీందర్‌కు అప్పుల వారి నుండి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ప్రభుత్వ పరంగా తగిన సహకారానికి మంత్రి అంగీకరించారన్నారు. తొందరపడి ఆత్మహత్యకు పాల్పడవద్దని తాము హామీ ఇచ్చామని డిఎస్పీ తెలిపారు. కాగా రవీందర్‌ను ఆతడి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నట్టు సిఐ విజయ్‌కుమార్ వెల్లడించారు. జిల్లా ఎస్పీ సూచన మేరకు హైదరాబాద్‌లోని రోషిణి కౌన్సిలింగ్ సెంటర్‌లో కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా రవీందర్‌ను పట్టుకోవడంలో కృషి చేసిన హెడ్‌కానిస్టేబుల్ పాషా బాబా, కానిస్టేబుల్ వెంకటేశ్ తదితర సిబ్బందిని డిఎస్పీ అభినందించారు.

చిత్రం విలేఖరుల సమక్షంలో రవీందర్‌ను హాజరుపర్చిన డిఎస్పీ, సిఐలు