తెలంగాణ

కెసిఆర్ భోళాశంకరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 29 : ముఖ్యమంత్రిని అధికారపక్షం సభ్యులు పొ గడటంలో వింతేమీలేదు. కానీ విపక్షసభ్యులు పొగిడితే అది విశేషమే. తెలంగాణ శాసనసభలో ఆ విశేషదృశ్యం సాక్షాత్కరించింది. నియోజికవర్గాలకు ఎమ్మెల్యేల తరపున నిధులు పెంచాలన్న అంశంపై శాసనసభలో మంగళవారం జరిగిన చర్చ సందర్భంగా విపక్షాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను భోళాశంకరుడిగా పేర్కొంటూ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఎమ్మెల్యేల కోటాలో నియోజకవర్గ అభివృద్ధి నిధులు పెంచాలని ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి మాట్లాడిన సందర్భంలో ఇది చోటు చేసుకుంది. సాధ్యమైనంత ఎక్కువ పెంచాలని జానారెడ్డి కోరిన తరువాత బిజెపి శాసనసభాపక్షం నాయకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ జానారెడ్డి అడిగేందుకు ఎందుకో మోహమాటపడుతున్నారని, కానీ ముఖ్యమంత్రి భోళాశంకరుడు, మనసు లో ఏది తోస్తే అది చేస్తారంటూ పలు అంశాల గురించి లక్ష్మణ్ వివరించారు. మార్కెట్ కమిటీ చైర్మన్‌ల నియామకంలో మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని కోరితే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారని, మరిన్ని పోస్టులు చేర్చి గ్రూప్-2ను వాయిదా వేయాలని కోరితే అప్పుడే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌తో మాట్లాడి నిర్ణయం తీసుకున్నారని లక్ష్మణ్ తెలిపారు. ఎస్‌ఐ పోస్టులకు ఇంగ్లీష్ తప్పనిసరి అనే నిబంధన తొలగించాలని డిజిపిని కలిస్తే, ఇంగ్లీష్‌లో ప్రావీణ్యం ఉండాల్సిందే అన్నారని తామంతా ముఖ్యమంత్రిని కలిస్తే డిజిపితో మాట్లాడి గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని, ఈ నిబంధన వల్ల పట్టణ ప్రాంతాల వారికే ప్రయోజనం కలుగుతుందని డిజిపికి ముఖ్యమంత్రి చెప్పి నిబంధన తొలగించేట్టు చేశారని లక్ష్మణ్ తెలిపారు. ముఖ్యమంత్రి భోళాశంకరుడు అని లక్ష్మణ్ అభినందించడంతో అధికారపక్షం సభ్యులు బల్లలు చరిచి మద్దతు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి నియోజక వర్గం అభివృద్ధి నిధి రెండు కోట్లకు పెంచుతున్నట్టు చెబితే విపక్ష సభ్యులు పలువురు ఒక్కసారిగా భోళాశంకరుడు అని గట్టిగా అనడంతో ముఖ్యమంత్రి నవ్వుతూ గ్యాలరీలో ఉన్న అధికారుల వైపు చూసి మూడు కోట్లకు పెంచుతున్నట్టు చెప్పారు.