తెలంగాణ

వాణిజ్యపన్నుల చెక్‌పోస్టుల వద్ద కట్టుదిట్టమైన భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 28: తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్యపన్నుల శాఖల తెచ్చి న వివిధ మార్పుల వల్ల రాష్ట్రానికి పన్ను ల రూపంలో రూ.32వేల కోట్ల రూపాయల ఆదాయం చేకురిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నపుడు తెలంగాణలో ఏడు చెక్‌పోస్టులు ఉంటే ప్రస్తుతం 14కు పెంచడంతో పాటు మరో రెండు ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్ రెండు చెక్‌పోస్టులను కలుపుకుని మొత్తం 16 చెక్ పోస్టులను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దుతామన్నారు. తెలంగాణ శాసన మండలిలో మంగవారం కూడా ప్రశ్నోత్తరాల పర్వం కొనసాగింది. ఉదయం పది గంటలకు చైర్మన్ స్వామీగౌడ్ అధ్యక్షతన ప్రారంభమైన సమావేశంలో అధికార, విపక్షాలకు చెందిన సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధా నం చెప్పారు. ఇందులో భాగంగా సభ్యుడు పురాణం సతీష్‌కుమార్ రాష్ట్రంలో వాణిజ్యపన్నుల శాఖను బలోపేతం చేయడానికి తీసుకుంటున్న చర్యల కోసం అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చేప్పారు. గతంలో తెలంగాణ ప్రాంతంలో 18వేల కోట్ల రూపాయలు ఆదాయంరాగా, అది ప్రస్తుతం 32వేల కోట్లకు చేరుకుందన్నారు. చెక్‌పోస్టులో నెలకొన్న అవీనితిని అరికట్టాడానికి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. చెక్‌పోస్టులను నవీకరించడం, వ్యాపారాల కొనుగోళ్లు, అమ్మకాల సమాచారం యొక్క ఇన్‌వాయిస్ ట్రాకింగ్, అమలు కార్యకలాపాలను పటిష్టపర్చడం వంటి కార్యక్రమాలు చేపడుతూ రాష్ట్రంలో వాణిజ్యపన్నుల శాఖలో ఖాళీగా ఉన్న ఐదువందల మంది స్థానాల్లో త్వరలో నియమకాలు జరుపుతామన్నారు. మంచి వ్యాపారం చేసుకొండి సకాలంలో పన్నులు చెల్లించండి అన్న నినాధంతో వాణిజ్య పన్నుల శాఖ పనిచేస్తుందని మంత్రి తెలిపారు. హైదరాబాద్ ట్రూప్‌బజార్‌లో జీరో బిజినెస్ యదేచ్చగా కోనసాగుతుందని దీనికి కొంత మంది అవినీతి అధికారుల అంగానిలుస్తున్నారని సభ్యుడు ఎంఎస్ ప్రభాకర్ ప్రభుత్వం దృష్టికి తీసుకవచ్చారు. అధికారుల పర్యవేక్షణ సరిగ్గాలేక పోవడంతో పన్నుల రూపంలో ప్రభుత్వానికి రవాల్సిన అదాయానికి కోట్లలో గండిపడుతుందని, దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం వెంటనే టాస్క్ఫోర్సు, విజిలెన్స్ పోలీసులను పటిష్ఠం చేయాలని కాంగ్రెస్ సభ్యులు పొంగులేటి సుధాకర్‌రెడ్డి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రైవెట్ బిల్డింగ్‌లలో కోనసాగుతున్న వాణిజ్యపన్నుల శాఖ కార్యాలయలకు ప్రతి జిల్లాలో ఒక్కటి చోప్పున పక్క భవనాన్ని నిర్మించేందుకు కృషి చేస్తామని మంత్రి తెలిపారు.