తెలంగాణ

హెచ్‌సియు ఘటనలపై హైకోర్టులో పిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 29: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, ప్రశాంత వాతావరణం నెలకొనేలా ఓ కమిటీ ఏర్పాటు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విద్యార్థులు, వైస్ ఛాన్సలర్ మధ్య సమన్వయం ఏర్పరచి అనుకూల వాతావరణం కల్పించాలని కోరుతూ వినోద్‌కుమార్ అనే ప్రొఫెసర్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు విసి, రిజిస్ట్రార్, సైబరాబాద్ కమిషనర్, విద్యార్థి సంఘం నేతలకు నోటీసులు జారీచేసింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

వడదెబ్బతో తొమ్మిదిమంది మృతి
మహబూబ్‌నగర్/వరంగల్/మెదక్/కరీంనగర్/ఆదిలాబాద్, మార్చి 29: మహబూబ్‌నగర్, వరంగల్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో వడదెబ్బ తీవ్రతతో తొమ్మిది మంది వ్యక్తులు మరణించారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండల పరిధిలోని నెల్విడి తండాకు చెందిన బీత్లానాయక్ (35) అనే వ్యక్తి మంగళవారం వడదెబ్బతో మృతి చెందాడు. బిజినేపల్లి మండలంలోని లింగసానిపల్లి గ్రామానికి చెందిన చట్టమోని బచ్చన్న (36) మంగళవారం వడదెబ్బకు గురై సాయంత్రం మృతి చెందాడు. మెదక్ మండలం శమ్నాపూర్‌కు చెందిన రంగయ్య (42) అనే వ్యక్తి నిజామాబాద్ జిల్లా దోమకొండలో మామిడి టంకరి పనులకు వెళ్లి వడదెబ్బతో మృతి చెందాడు. నంగునూరు మండలం అంక్షాపూర్ గ్రామంలో మాచర్ల రాజవ్వ (52) ఉపాధి హామీ కూలీ వడదెబ్బతో మృతి చెందింది. వరంగల్ జిల్లా మొగుళ్ళపల్లి మండలం మేదరమెట్ల గ్రామంలో మంగళవారం ఉపాధి పనులకు వెళ్లిన నాంపెల్లి అరుణ (48) వడదెబ్బ తగిలి మృతి చెందింది. కరీంనగర్ జిల్లా ధర్మారం మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన అజ్మీరా దోర్గాన్ (58) అనే ఉపాధి హామీ కూలీ మృతి చెందింది. ఎల్కతుర్తి మండలం జగన్నాధపూర్ గ్రామానికి చెందిన గూటం నర్సింహారెడ్డి (65) అనే వృద్ధుడు మంగళవారం వడదెబ్బ తాకి మృతి చెందాడు. మేడిపల్లి మండలంలోని భీమారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీనివాస్ (34) అనే యువకుడు మంగళవారం వడదెబ్బతో మృతి చెందాడు. ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు మండలం అందుగుల గూడ గ్రామానికి చెందిన నైతం రాములు (45) ఉపాధి హామీ కూలీ పని కోసం వెళ్లి వడదెబ్బ తగిలి వడదెబ్బకు మృతి చెందాడు.

అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య
మెదక్/నిజామాబాద్, మార్చి 29 : అప్పుల బాధ లు భరించలేక మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో ఇద్దరు రైతులు మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్ జిల్లా నంగునూరు మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన బోడ గంగారెడ్డి (38) తనకున్న ఐదెకరాల భూమిలో ఏడు పంటల సాగు కోసం అప్పులు చేసి నాలుగు బోర్లు వేశాడు. భూగర్భ జలాలు అడిగంటిపోవడంతో బోరు బావుల్లో నీరు రాక వేసిన మెక్కజొన్న, బబ్బెర పంటలు ఎండిపోవడంతో పంటలకు చేసిన అప్పులు ఎలా తీర్చాలని తీవ్ర మనస్తాపానికి గురై గ్రామ శివారులోని మైసమ్మ గుడి వద్ద మంగళవారం తెల్లవారు జామున పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని జలాల్‌పూర్ గ్రామానికి చెందిన రాజలింగం (42) అనే రైతు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సాగర్‌కు నిలిచిపోయిన ఇన్‌ఫ్లో
నాగార్జునసాగర్, మార్చి 29: నాగార్జునసాగర్ జలాశయానికి గత మూడురోజులుగా శ్రీశైలం నుండి వస్తున్న నీటిరాక పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం సాగర్ జలాశయంలో 508.50 అడుగుల నీటిమట్టం ఉండగా కుడికాల్వ ద్వారా 4,201 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బిసి ద్వారా 1200 క్యూసెక్కులను మొత్తంగా 5,401 క్యూసెక్కులను సాగర్ జలాశయం నుండి బయటకు విడుదల చేస్తున్నారు.