తెలంగాణ

ఈ విద్యాసంవత్సరంలో 70 మైనార్టీ గురుకుల పాఠశాలలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, మార్చి 29: మైనార్టీవర్గాల విద్యార్థులకు కార్పొరేట్‌కు ధీటుగా ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యనందించేందుకు రాష్టవ్య్రాప్తంగా 120 మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఎసిబి డైరెక్టర్ జనరల్, మైనార్టీ వెల్ఫేర్ బోర్డు కమిటీ కార్యదర్శి ఎకె.ఖాన్ తెలిపారు. ఈ విద్యాసంవత్సరం రాష్ట్రంలో 70 పాఠశాలలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. మైనార్టీ గురుకుల పాఠశాలల ఏర్పాటుకోసం అద్ద్భెవనాల పరిశీలన కోసం జిల్లాలో పర్యటించిన ఆయన మంగళవారం నల్లగొండ జిల్లా సూర్యాపేట రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్థికంగా వెనుకబడి ఉన్న మైనార్టీ వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో కెసిఆర్ ఈ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
షాదీముబారక్‌పై ఎసిబి విచారణ
మిర్యాలగూడ: రాష్ట్రంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరుగుతోందని అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ ఎకె.ఖాన్ అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఆర్ అండ్ బి అతిధి గృహంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కొంతమంది దళారులు నిరుపేద ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీలను ఆశ్రయించి పనులు చేయిస్తామని డబ్బులు దండుకుంటున్నారని, తమకు అందిన సమాచారం మేరకు తాము 15 కేసులు నమోదు చేశామని, పోలీస్ శాఖ కూడా వారిపై కేసులు నమోదు చేస్తోందని ఆయన అన్నారు.