తెలంగాణ

రాష్ట్ర సాధన ఫలాలు అందరికీ అందాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 28: తెలంగాణ రాష్ట్ర సాధన ఫలాలు అందరికీ దక్కేలా ప్రభుత్వ విధానాలు కొనసాగాలని జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సోమవారం నల్లగొండ లెక్చరర్స్ భవన్‌లో సివిక్స్ లెక్చరర్స్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామ్య దృక్పథం’ అంశంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వనరులు, బడ్జెట్ కేటాయింపులు అన్ని వర్గాల అభ్యున్నతికి బాటలు వేసేలా ఉండాలన్నారు. ఉద్యమకాలంలో వ్యక్తమైన ఆశలను సాకారం చేసే దిశగా ప్రభుత్వ విధానాలు అమలు కావాల్సివుందన్నారు. ప్రజాస్వామ్య తెలంగాణతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, కులవృత్తులు, వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో ఆ వర్గాల పునరుద్ధరణకు ప్రభుత్వం తగిన పాలనా విధానాలు అమలు చేయాలన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని తమ భుజాలపై మోసిన యువతకు భవిష్యత్‌పై భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మేధావులు, విద్యార్థులు, విద్యావేత్తలు, సామాజిక శక్తులన్ని వౌనాన్ని వీడి రాష్ట్ర పునర్ నిర్మాణంలో క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచన కూడా ఇదేనన్నారు. తెలంగాణ నిర్మాణం భౌతికంగా జరిగిందని, దీనికి ప్రాణప్రతిష్ట చేసేందుకు ప్రజాస్వామిక సామాజిక శక్తులు కృషి చేయాలన్నారు. చిన్న రాష్ట్రాల స్ఫూర్తి ప్రధాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ సూచించిన బాటలో రాష్ట్ర పునర్ నిర్మాణం సాగాలన్నారు. తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర కరవు నెలకొనడంతో గ్రామీణ ప్రజలు కరవు బారిన పడి జీవన దుర్భరంగా మారుతుందన్నారు. రైతులు, రైతు కూలీలు, కార్మిక వర్గాలు, కుల వృత్తిదారులు కరవు పీడితులుగా మారారన్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే కరవు సహాయక చర్యలు చేపట్టాలన్నారు. అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యేలంతా కరవు సహాయక చర్యలపై చర్చ చేసి ప్రజలను ఆదుకోవాలన్నారు. అశాస్ర్తియ విధానాల ఫలితంగానే దేవరకొండ, మునగాల, గుండాల వంటి మండలాలను కరవు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించలేదన్నారు. కరవు పీడిత ప్రాంతాల ఎంపికలో లోపాలను సరిచేసి మిగిలిపోయిన మండలాలను కరవు పీడిత జాబితాల్లో చేర్చాలన్నారు. ఉపాధి హామీ పథకం పనులను గ్రామాల్లో మమ్మురం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలన్నారు. పాడిపంటల విధానంతోనే రైతుకు మేలు కలుగుతుందన్నారు. పశుగ్రాసం కొరతను నివారించాలన్నారు. ఈ సదస్సులో ఆర్‌ఐవో ప్రకాశ్‌బాబు, కవి, రచయిత వేణు సంకోజు, అధ్యాపక, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.