తెలంగాణ

రైతు వ్యతిరేక విధానాలు వీడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, మార్చి 28: రాష్ట్రంలో టిఆర్‌ఎస్ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని రాష్ట్ర తెలుగురైతు అధ్యక్షుడు వంటేను ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. సోమవారం మెదక్ జిల్లా గజ్వేల్ మండల పరిధిలోని రిమ్మనగూడ, కొడకండ్ల తదితర ప్రాంతాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన సిఎం కెసిఆర్ అమలులో మాత్రం విఫలమైనట్లు విమర్శించారు. ముఖ్యంగా పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం అతివృష్టి, అనావృష్టిలతో నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమైనట్లు ఆరోపించారు. అయితే పట్ట నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఇన్‌ఫుడ్ సబ్సిడీ నిధులు మంజూరు చేసినప్పటికీ రైతులకు అందించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు స్పష్టం చేశారు. టిఆర్‌ఎస్ రైతు వ్యతిరేక విధానాలతో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పటికీ నివారించడంలో ప్రభుత్వం పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తుందని ఎద్దేవా చేశారు. అయితే పంట రుణమాఫీని ఏకకాలంలో వర్తింపచేస్తూ రైతులకు తిరిగి రుణాలు అందిస్తే ఆత్మహత్యలు తగ్గేవని, స్వప్రయోజనాలకోసం సిఎం కెసిఆర్ ఆలోచిస్తున్నారే తప్ప పేదలకు ఒరగబెట్టిందేమి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 15వందల మందికి పైగా రైతులు ఆత్మార్పణ చేసుకున్నప్పటికీ ఏ ఒక్క కుటుంబాన్నీ సిఎం పరామర్శించిన పాపాన పోలేదన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఎలాంటి షరతులూ లేకుండా రూ.10లక్షల నష్టపరిహారం చెల్లించాలని, పంటలకు తొమ్మిది గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని, పంట రుణమాఫీని ఏకకాలంలో వర్తిపంచేయాలని, కేంద్రం వివిధ గ్రాంట్ల ద్వారా మంజూరు చేసిన నిధులను వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులను చైతన్యం చేస్తూ రాష్ట్ర వ్యాప్తం అందోళనకు శ్రీకారం చుడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నేతలు బొల్లారం ఎల్లయ్య, పరచూరి రాజేష్, షర్ఫొద్దీన్, హన్మంతరెడ్డి, రఘుపతిరెడ్డి, భూమయ్య యాదవ్, శ్రీనివాస్, కైలాస మహిపాల్, మలియాల భద్రయ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.