తెలంగాణ

రెండేళ్లలో సిసిటీవి వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని జిల్లాలను హైదరాబాద్‌తో సిసిటివిల ద్వారా అనుసంధానం చేయనున్నట్లు హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి ప్రకటించారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వి శ్రీనివాస్‌గౌడ్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, హైదరాబాద్‌లో సిసిటివి వ్యవస్ధ ప్రాజెక్టు వ్యయం రూ. 657కోట్లు, కమాండ్ కంట్రోలు కేంద్రం ప్రాజెక్టు వ్యయం రూ.302 కోట్లని చెప్పారు. ఈ ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు. నగరానికి చెందిన అభయ్ కిడ్నాప్, హత్య కేసులో నిందితులను సిసిటివి ఫుటేజిల ద్వారా పట్టుకున్నామని చెప్పారు. గతంలో కెబిఆర్ పార్కు వద్ద జరిగిన ఉదంతంలో నిందితులను వెంటనే సిసిటివి కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించామన్నారు. హైదరాబాద్‌లో 10 వల సిసిటివి కెమెరాలను సున్నిత, అత్యంత సున్నిత ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి షాపు 50 మీటర్ల వరకు కవర్ చేసే విధంగా సిసిటివి కెమెరాలను పెట్టుకుంటేనే భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చే విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో దశలవారీగా ఒక లక్ష సిసిటివి కెమెరాలను అమర్చుతామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో హబ్‌గా తీర్చిదిద్దుతామని గిరిజన, పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ ప్రకటించారు. టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ హెలి టూరిజాన్ని ప్రారంభించామని, కొన్ని అనుమతుల వల్ల నిలిచిపోయినా, మళ్లీ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. బ్రాండ్ తెలంగాణ పర్యాటక అభివృద్ధికోసం హైదరాబాద్ జాయ్ రైడ్స్‌ను ప్రారంభించామన్నారు. హైదరాబాద్‌లోని మెసర్స్ ఇండ్‌వెల్ ఏవియేషన్ సంస్ధ, మెసర్స్ ఆటమ్ ఏవియేషన్ సర్వీసస్ సంస్ధకు హెలిటూరిజం నిమిత్తం అనుమతి ఇచ్చామన్నారు. నిజాంసాగర్, ఆదిలాబాద్‌లోని కుంటూరు జలపాతంవద్ద పర్యాటక రంగం అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామన్నారు.