తెలంగాణ

జన్మనిచ్చి.. పాలు ఇచ్చేందుకు నిరాకరించి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. ఆడపిల్లగా పుట్టిన పాపానికి ఓ కన్నతల్లి 24 గంటల పాటు శిశువుకు పాలివ్వకుండా హతమార్చాలని చూసింది. ఆసుపత్రిలో కాన్పు అయిన మహిళ కసాయిగా వ్యవహరిస్తుండడంతో పరిస్థితిని గమనించిన వైద్యులు ఐసిడిఎస్ సిడిపివో సక్కుబాయికి సమాచారం అందించడంతో ఆసుపత్రికి చేరిన సిడిపివో కన్నతల్లికి ఎంత నచ్చజెప్పినా శిశువును సాదుకునేందుకు కన్నతల్లి అంగీకరించకపోవడంతో నల్లగొండ శిశువిహార్‌కు చిన్నారిని పంపించి వేశారు. సంచలనం కలిగించిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. చందంపేట మండలం కంబాలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మంగలితండాకు చెందిన రమావత్ పద్మ సోమవారం దేవరకొండ పట్టణంలోని స్థానిక ఆసుపత్రిలో నాలుగో కాన్పులో ఆడపిల్లకు జన్మనిచ్చింది. మొదటి కాన్పులో మగపిల్లాడు పుట్టగా అనారోగ్యంతో కొన్ని రోజులకే చనిపోయాడు. అనంతరం జరిగిన రెండు, మూడో కాన్పులో పద్మ ఆడపిల్లలకు జన్మనిచ్చింది. వారు ప్రస్తుతం పాఠశాలకు వెళ్తున్నారు. పద్మ సోమవారం నాలుగో కాన్పులో ఆడపిల్ల పుట్టడంతో శిశువును సాకలేమన్న ఉద్దేశంతో సోమవారం మధ్యాహ్నం నుండి మంగళవారం సాయంత్రం వరకు చిన్నారికి పాలు పట్టించలేదు. దీంతో ఆకలితో చిన్నారి రోదనలు అందరినీ కలిచివేశాయి. పద్మకు ఎంత నచ్చజెప్పినా ఆమె చిన్నారికి పాలు ఇచ్చేందుకు అంగీకరించకపోవడంతో వైద్యులే పాలప్యాకెట్‌లను తీసుకొచ్చి నర్సులతో చిన్నారికి పాలు పట్టించారు. చిన్నారిని ఏదోవిధంగా వదిలించుకోవాలని చూస్తున్నారని గుర్తించిన వైద్యులు సిడిపివో సక్కుబాయి దృష్టికి తీసుకెళ్లారు. పద్మకు కౌనె్సలింగ్ ఇచ్చినా అంగీకరించకపోవడంతో చేసేదేమీ లేక సిడిపివో చిన్నారిని నల్లగొండ పట్టణంలోని శిశుగృహకు తరలించారు.