తెలంగాణ

యుద్ధం ఏకపక్షమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్/ఖమ్మం: గ్రేటర్ వరంగల్, ఖమ్మం కారొపరేషన్లతో పాటు అచ్చంపేట మున్సిపాలిటీకి ఆదివారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. వరంగల్‌లో జరిగిన ఎన్నికలకు నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు. సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల వద్ద మరింత భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా స్ట్రైకింగ్ ఫోర్స్ పర్యవేక్షణలో బందోబస్తు పర్యవేక్షించారు. చిన్నచిన్న సంఘటనల మినహా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకపోవడంతో పోలీసులు, అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు. గ్రేటర్ పరిధిలోని మొత్తం 58 డివిజన్లలో తెరాస, బిజెపి పోటీలు పడగా, కాంగ్రెస్ 48, టిడిపి 51 డివిజన్లకే పోటీ చేశాయి. పోలింగ్ సరళిని చూస్తుంటే తాము దాదాపు 45 నుండి 50 సీట్లు గెలుచుకోవడం ఖాయమని స్పష్టమవుతోందని తెరాస నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొన్ని డివిజన్లలో రెబల్స్, మరికొన్ని డివిజన్లలో బిజెపి, కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ ఈ ఎన్నికల్లో తమకు ఏకపక్ష విజయం తథ్యమని తెరాస నేతలు అంటున్నారు. వివిధ డివిజన్లలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అటు అధికార పార్టీ అభ్యర్థులు, ఇటు ప్రతిపక్షాల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా డబ్బు పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఖమ్మంలో 67.68 శాతం పోలింగ్
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు స్వల్ప ఉద్రిక్తతల మధ్య ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 2,65,710మంది ఓటర్లకు గాను 1,79,827 మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో 67.68శాతం పోలింగ్ నమోదైంది. ఖమ్మం మున్సిపాలిటీగా ఉన్నప్పటికంటే ఈసారి పోలింగ్ శాతం ఎక్కువగా నమోదవటం గమనార్హం. గతంలో 66.79శాతం నమోదు కాగా ఇప్పుడు మరో శాతం పెరిగింది. అత్యధికంగా 1వ డివిజన్‌లో 88.16 శాతం నమోదు కాగా అత్యల్పంగా 11వ డివిజన్‌లో 54.58 శాతం నమోదైంది. నగరంలోని 50డివిజన్ల నుంచి మొత్తం 291 మంది అభ్యర్ధులు పోటీ పడగా, 265 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఓటర్లు తమ ఓట్లను సరిచూసుకునేందుకు 35 బూత్‌లలో ప్రింటర్లను ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ఉదయం 7 గంటలకే ప్రజలు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. దీంతో మధ్యాహ్నానికే 50 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది.
భారీగా నకిలీ ఐడిలు
ఇదిలావుంటే, రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా 22వ డివిజన్‌లో నకిలీ ఓటరు గుర్తింపుకార్డులు బయటపడ్డాయి. తెరాస అభ్యర్థే వీటిని తయారుచేయించాడని ప్రచారం జరగటంతో అన్ని పార్టీల అభ్యర్థులు ఒక్కటై రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. వీరికి ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, టిడిపి, కాంగ్రెస్, వైసిపి నేతలు మద్దతు పలికారు. దీనిపై జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ లోకేష్‌కుమార్‌కు టిడిపి నేతలు ఫిర్యాదు చేశారు. 22వ డివిజన్‌లో రీ పోలింగ్ జరపాలని లేఖ అందించారు. అలాగే 26వ డివిజన్‌లో దొంగ ఓట్లు వేస్తున్నారనే నెపంతో ఇద్దరిని వైసిపి అభ్యర్థి పట్టుకొని పోలీసులకు అప్పగించగా, వారు వారిని వెంటనే వదిలివేయటంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. కాగా, రెండు రోజుల క్రితం పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన కొందరు కాంగ్రెస్, టిడిపి, వైకాపా అభ్యర్థులు ఎన్నికల రోజు మాత్రం తమకే ఓటు వేయాలని కోరటం గమనార్హం. 11వ డివిజన్‌లో ఓ విద్యార్థిని దొంగ ఓటు వేసేందుకు ప్రయత్నించింది. 16వ డివిజన్‌లో అధికార పార్టీ అభ్యర్థికి మద్దతుగా డబ్బులు పంచుతుండగా బిజెపి నేతలు పట్టుకున్నారు. కాగా ఎన్నికలు ప్రశాంతంగా జరిగినప్పటికీ అన్ని చోట్ల పోలింగ్ పూర్తయ్యే దాకా ఓటర్లకు నగదు పంపిణీ కొనసాగింది. కొన్ని చోట్ల తెరాస అభ్యర్థులను ఓడించాలంటూ చివరి నిమిషంలో కాంగ్రెస్, టిడిపి అభ్యర్థులు ఒక్కటి కావటం విశేషం. పోలింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షించారు.
అచ్చంపేటలో 71శాతం పోలింగ్
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలోని అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయ. పదేళ్ల తర్వాత జరిగిన ఈ ఎన్నికలకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొన్నారు. దీంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా 71 శాతం పోలింగ్ నమోదైంది. 20 వార్డుల్లో 18,614 ఓటర్లకు గాను 13,193 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో తెరాస ఒంటరిగా పోటీ చేస్తుండగా కాంగ్రెస్, బిజెపి, టిడిపిలు ఐక్యకూటమిగా బరిలోకి దిగాయ. ఈ మూడు పార్టీలు ఏకం కావడంతో ఎన్నికలు రసవత్తంగా మారాయి. పోలింగ్ సరళి, ఓటర్ల అభిప్రాయం ప్రకారం తెరాసదే పైచేయిగా కనిపిస్తున్నప్పటికీ కొన్ని వార్డుల్లో ఐక్య కూటమి అభ్యర్థులు గట్టిపోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
యుద్ధం ఏకపక్షమా?
యుద్ధం ఏకపక్షమా?