తెలంగాణ

ఎంతిస్తారో చెప్పలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 29: ఎన్‌డిఏ మిత్రపక్షాల కన్నా టిఆర్‌ఎస్ నుంచే బడ్జెట్‌కు కేంద్రానికి సానుకూల స్పందన లభించింది. ఆర్థిక మంత్రి జైట్లీ బడ్జెట్‌ను టిఆర్‌ఎస్ ఎంపీలు అభినందిస్తూ స్వాగతించారు. బడ్జెట్‌లో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి పెద్ద పీట వేశారని నిజామాబాద్ ఎంపి కవిత అభినందించారు. రోడ్లు, రవాణా రంగానికి కేటాయింపులు బాగున్నాయని, అయితే ఏ రాష్ట్రానికి ఎంతిస్తారో బడ్జెట్‌లో వివరంగా చెప్పలేదని అన్నారు. కొత్త రాష్టమ్రైన తెలంగాణకు ఏ మేరకు నిధులు ఇస్తారో చూడాలని తెలిపారు. బ్యాంకులను ఆదుకోవడం, నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం మంచి పరిణామమని అన్నారు. మహిళా ఉద్యోగులకు ఆరు లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు ఉంటే బాగుండేదని తెలిపారు. సంస్కరణలు ఆశించినంతగా లేవని, సంస్కరణలకు కొంతవరకు దూరమయ్యారని అన్నారు. గత బడ్జెట్ కన్నా ఇది చాలా మంచి బడ్జెట్ అని అభినందించారు. గ్రామాలు, గ్రామ స్వరాజ్యం గురించి ఆలోచించిన బడ్జెట్ అని అభినందించారు.
తెలంగాణ ప్రభుత్వం ఏయే రంగాలను ప్రాధాన్యతా రంగాలుగా గుర్తించిందో కేంద్రం కూడా అదే విధంగా గుర్తించడం గర్వకారణమని టిఆర్‌ఎస్ ఎంపి జితేందర్‌రెడ్డి తెలిపారు. వ్యవసాయం, రోడ్లు, పేదలు, మధ్యతరగతి, గ్రామాలకు ప్రాధాన్యత ఇవ్వడం స్వాగతించాల్సిన అంశమని అన్నారు. రాష్ట్రానికి ఏ రకంగా కేటాయింపులు ఉంటాయో బడ్జెట్ అనెక్సరీ చూసి పూర్తి స్థాయిలో స్పందిస్తామన్నారు.
ఉద్యోగులను నిరాశ పరిచిన బడ్జెట్
ఉద్యోగ వర్గాన్ని ఈ బడ్జెట్ పూర్తిగా నిరాశ పరిచిందని టిఎన్‌జివో మాజీ అధ్యక్షుడు, టిఆర్‌ఎస్ నాయకుడు దేవీ ప్రసాద్ తెలిపారు. ఆదాయం పన్ను పరిమితిని ఐదులక్షల రూపాయలు చేస్తారని ఉద్యోగులు ఆశించారని కానీ కేంద్ర మంత్రి ఆ దిశగా ఎలాంటి ఆలోచన చేయలేదని అన్నారు. యుపిఏ అధికారంలో ఉన్నప్పుడు ఐదు లక్షల వరకు పన్ను మినహాయింపు ఉండాలని ఎన్‌డిఏ డిమాండ్ చేస్తూ వచ్చిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనూ ఉద్యోగులకు నిరాశే మిగిలిందని అన్నారు.

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 29: పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి మార్చి 6న రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కానుంది. మార్చి 6వ తేదీన సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం కానుంది. శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరిగే తేదీలను ఖరారు చేయడంతో పాటు ఇటీవల శాఖల వారీగా వచ్చిన బడ్జెట్ ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చించి మంత్రి మండలి ఆమోదించనుంది. అలాగే జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించడానికి గ్రామీణాభివృద్థిశాఖకు చెందిన వంద ఎకరాలను ప్రభుత్వానికి తిరిగి ఇవ్వడం, ఈ పథకానికి అవసరమయ్యే నిధులు కేటాయింపుపై కూడా చర్చించి మంత్రిమండలి ఆమోదించనున్నట్టు సమాచారం.

ప్రగతి బాట: కిషన్‌రెడ్డి
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపాదించిన బడ్జెట్ దేశ ఆర్థికాభివృద్ధికి, ప్రగతికి బాటలు వేసేలా ఉంది. గ్రామీణాభివృద్ధికి, వ్యవసాయానికి, ఉపాధి, వైద్య రంగాలకు, దళిత, గిరిజనులకు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఇలా అన్ని రంగాలకూ పెద్ద పీట వేశారు. ఆదాయం, ఆహార భద్రత, ఎన్‌ఆర్‌ఇపి, పంటల బీమా పథకానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు.
ఇదేమి బడ్జెట్: షబ్బీర్ అలీ
ఇదేం బడ్జెట్. తెలంగాణ ప్రజలు ఆశించిన విధంగా బడ్జెట్ లేదు. బడ్జెట్ కేటాయింపులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తుందని ప్రజలు ఆశించారు. కానీ వారు కోరుకున్న విధంగా బడ్జెట్ కేటాయింపులు జరగలేదు. బీడి కట్టలపై పుర్రె గుర్తు తొలగించలేదు. పేదలకు ఏ మాత్రం ఉపయోగం లేని బడ్జెట్. సంపన్నవర్గాలకే ఉపయోగపడుతుంది.
తిరోగమన బడ్జెట్: సిపిఐ నారాయణ
విదేశీ, స్వదేశీ కార్పొరేట్ సంస్థలు సంతోషంగా ఉండటం, రైతాంగం పునాదిగా ఉన్న భారత దేశ ప్రజల నిరుత్సాహానికి ఈ బడ్జెట్ అద్దం పట్టింది. 19 లక్షల 75 వేల కోట్ల బడ్జెట్‌లో వ్యవసాయానికి 35 వేల కోట్ల కేటాయింపు రైతులపై ఉన్న కపట ప్రేమను తెలియజేస్తోంది. ఏపి ప్రత్యేక హోదా, తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ గురించి ప్రస్తావనే లేదు. పోలవరం వంటి బహుళార్థ సాధక ప్రాజెక్టుకు రూ.100 కోట్లు కేటాయించడం మొక్కుబడి చర్య.