తెలంగాణ

సందిగ్ధంలో ‘క్రమబద్ధీకరణ’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 25: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆక్రమిత ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ సకాలంలో పూర్తిచేయకపోవడంతో అక్రమ భవన నిర్మాణాల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు చేసుకునే అర్హత కోల్పోయే పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా సంక్రాంతి కానుకగా పూర్తి డబ్బులు చెల్లించిన దరఖాస్తుదారులకు వెంట నే 59 జీవో ద్వారా రిజిస్ట్రేషన్లు చేయిస్తామని చెప్పినా ఇప్పటివరకు ప్రక్రియ మొదలు పెట్టకపోవడంతో అక్రమ భవన నిర్మాణాలు, అక్రమ లే ఔట్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకునే గడువు మార్చి 1వ తేదీలోగా పూర్తి కావడంతో క్రమబద్ధీకరణ అంశంపై స్పష్టత లేదంటూ దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.
రంగారెడ్డి జిల్లాలో 59 జీవో ద్వారా 11,846 మంది 58 జీవో నుండి 59 జీవోకు మార్పిడి చేసిన 8360 మంది మొత్తం 20203 మంది అక్రమంగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని భవనాలు నిర్మించుకున్నామంటూ స్వయంగా ఒప్పుకుంటూ దరఖాస్తు చేసుకున్నప్పటికి వారి స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియ జాప్యం జరుగడంతో భవన నిర్మాణాల క్రమబద్ధీకరణ సందిగ్ధంలో పడింది. దీనిపై రెవెన్యూ అధికారులు కేవలం స్థలాలను మాత్రమే క్రమబద్ధీకరిస్తున్నామని, అక్రమ భవన నిర్మాణాలను తాము క్రమబద్ధీకరించలేమని స్పష్టత ఇవ్వడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. వీరికి అక్రమ భవన నిర్మాణాలు కూడా క్రమబద్ధీకరిస్తే తప్ప అస్సెస్‌మెంట్ చేయటం, ఆస్తి పన్నుల చెల్లింపుల్లో ఎలాంటి అపరాధ రుసుములు లేకుండా ఉంటుందన్న భావన ఉన్నప్పటికి వారికి దరఖాస్తు చేసుకునే అవకాశాలు లేకుండా పోతున్నాయి. విధానపరంగా స్పష్టమైన వైఖరిని ప్రభుత్వం ప్రకటించకపోవడంతో స్థానికుల నుండి వస్తున్న ప్రశ్నలకు అధికారులు సమాధానాలు ఇవ్వలేకపోతున్నారు. ప్రభుత్వ స్థలం ఆక్రమించుకుని స్థలాలను క్రమబద్ధీకరించుకున్నప్పటికీ భవన నిర్మాణాలను విడిగా క్రమబద్ధీకరించుకోవాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. దారిద్య్రరేఖకు దిగువన వున్న ఇంటి యజమానులకు ఆస్తి పన్నుల చెల్లింపులో మినహాయింపు కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించినప్పటికి ప్రభుత్వ పట్టాలు పొంది ఇళ్లు నిర్మించుకున్న వారు సైతం భవన నిర్మాణాలను క్రమబద్ధీకరణ చేసుకోలేకపోతే యథావిధిగా ఆస్తిపన్నును అస్సెస్‌మెంట్ సమయంలో అనుమతిలేని భవన నిర్మాణంగా పరిగణిస్తూ 100 శాతం అపరాధ రుసుము వేయాల్సిందేనంటూ స్పష్టం చేస్తున్నారు. ఇప్పటివరకు తమకున్న ఆధార పత్రాలతో దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం ఆక్రమిత స్థలాలను క్రమబద్ధీకరణ చేస్తూ జారీచేసిన దస్తావేజులను తర్వాత జతపరిస్తే కొంతమేరకు భవన నిర్మాణాలు క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఉందని జిహెచ్‌ఎంసిలోని ఓ ఉన్నతాధికారి సూచించారు.