తెలంగాణ

అందరికీ రెబల్స్ బెడద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్‌లో అన్ని పార్టీలకు రెబల్స్ బెడద అధికంగా ఉంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు సమయం ఉన్నప్పటికీ నామినేషన్లు వేసిన వారిలో ఒక్కరు కూడా ఉపసంహరించుకునేందుకు ఆసక్తి చూపకపోవటంతో ఆయా పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు. చివరికి కమ్యూనిస్టు పార్టీలకు కూడా రెబల్స్‌బెడద తప్పలేదు. ఖమ్మం కార్పొరేషన్‌లోని 50డివిజన్లు ఉండగా, వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థులుగా 68మంది, టిఆర్‌ఎస్ అభ్యర్థులుగా 139మంది, టిడిపి అభ్యర్థులుగా 87మంది, కాంగ్రెస్ అభ్యర్థులుగా 93మంది, సిపిఎం అభ్యర్థులుగా 53మంది, కాంగ్రెస్‌తో పొత్తుతో ఆరు వార్డులకు పోటీ చేయనున్న సిపిఐ అభ్యర్థులుగా 20మంది బరిలో ఉండటం గమనార్హం. ఒక్కొక్క డివిజన్ నుంచి అధికార పార్టీ తరుపున ఆరుగురు కూడా నామినేషన్ దాఖలు చేయటం గమనార్హం. మరో వైపు తాము ఆశించిన పార్టీ నుంచి టిక్కెట్ దక్కపోవటంతో 115మంది స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఖమ్మం కార్పొరేషన్‌లో ప్రతి డివిజన్‌లోను సరాసరిన 10మందికిపైగా అభ్యర్థులు పోటీలో ఉండే అవకాశం కన్పిస్తోంది. ఇదిలా ఉండగా మేయర్ పీఠంపై కనే్నసిన కాంగ్రెస్, టిఆర్‌ఎస్ నేతలు రెబల్స్‌ను బుజ్జగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, టిఆర్‌ఎస్ తరుపున రాష్టమ్రంత్రి తుమ్మల నాగేశ్వరరావు నామినేషన్లు వేసిన అభ్యర్థులతో చర్చలు జరుపుతూ వారిని ఉపసంహరించుకునేలా ప్రయత్నిస్తున్నారు. ముందుగా తమపార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఇతర పార్టీ అభ్యర్థులను రంగంలో నుంచి తప్పించి ఏకగ్రీవం చేసుకోవాలనే అధికార పార్టీ నేతల ఆలోచనకు ఆ పార్టీ నేతలు గండికొట్టినట్లయింది. ఇతర పార్టీల అభ్యర్థుల గురించి కాకుండా సొంత పార్టీ నేతల గురించే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఉప సంహరణకు సమయం లేకపోవటం, ఆ తర్వాత ఎన్నికకు కూడా కేవలం 9రోజుల వ్యవధే ఉన్న నేపథ్యంలో ఉపసంహరణల అనంతరం రాష్టస్థ్రాయి నేతలతో అన్ని రాజకీయ పార్టీల నేతలతో ప్రచారాన్ని నిర్వహించనున్నాయి.