తెలంగాణ

పేదల చిరునవ్వుతోనే.. తెలంగాణకు సార్థకత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పేదల ముఖాల్లో చిరునవ్వులు కనిపించిన రోజే సాధించుకున్న తెలంగాణకు సార్థకత అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయం వ్యక్తం చేశారు. టిడిపి శాసన సభాపక్ష నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కాంగ్రెస్‌పార్టీకి చెందిన మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, ఆ రెండు పార్టీలకు చెందిన పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గురువారం తెరాసలో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కెసిఆర్ మాట్లాడుతూ, శతాబ్దాల పాటు పరాయిపాలనలో ఉన్న తెలంగాణలో ఏ వర్గానికీ మేలు జరగలేదని, దళితులు, బిసిలు, మైనారిటీలు అంతా పేదరికంలోనే ఉన్నారని అన్నారు. ఇతర పార్టీలకు చెందిన నాయకులు తెరాసలో చేరడాన్ని సాధారణ చేరికల మాదిరిగా చూడవద్దని, దేశంలో తలెత్తుకుని నిలబడే విధంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు అందరం ఏకం కావలసిన అవసరం ఉందని అన్నారు. మిషన్ భగీరథ పనులు చురుగ్గా సాగుతున్నాయని, ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటున్నామని, దీని వల్ల వరంగల్‌లో రెండు పంటలు పండించుకోవచ్చుని చెప్పారు. ‘వర్థన్నపేట మనదే’ అని ఈ సందర్భంగా కొంత మంది కార్యకర్తలు నినాదాలు చేయడంతో, ‘తెలంగాణలో అన్ని పేటలు మనవే, తెలంగాణలోని ప్రతి అంగుళం మనదే’నని కెసిఆర్ ప్రకటించారు. అనంతరం ఆయన ఎర్రబెల్లి దయాకర్‌రావుకు గులాబీ కండువా కప్పి తెరాసలోకి స్వాగతం పలికారు.
కెసిఆర్‌ను తిట్టినందుకు బాధపడుతున్నా..
తెలంగాణలో బాబు చేతులెత్తేశాడు:ఎర్రబెల్లి
కాగా, దయాకర్‌రావు మాట్లాడుతూ, తెలంగాణలో టిడిపికి ఇక ఎలాంటి భవిష్యత్తు లేదని, చంద్రబాబు నాయుడు తెలంగాణలో చేతులెత్తేశాడని చెప్పారు. కెసిఆర్ చాలా మంచివారని, గతంలో ఆయనను తిట్టినందుకు బాధపడుతున్నానన్నారు. ‘కెసిఆర్ ఆలోచనలు అద్భుతంగా ఉన్నాయి. బడ్జెట్‌పై సమీక్షలు చూసి ఆశ్చర్య పోతున్నాను, రెండేళ్ల క్రితమే తెరాసలో చేరి ఉండాల్సింది’ అని ఆయన అన్నారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున వరంగల్ జిల్లాకు ముఖ్యమంత్రి వరాలు ప్రకటించలేదని, జిల్లా అభివృద్ధి కోసం పలు పథకాలు అమలు చేసేందుకు కెసిఆర్ సిద్ధంగా ఉన్నారని, వరంగల్ నగర అభివృద్ధికే రూ.300 కోట్లు మంజూరు చేయనున్నారని తెలిపారు. తెలంగాణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని టిడిపి కార్యకర్తలంతా తెరాసలో చేరాల్సిందిగా ఆహ్వానిస్తున్నానన్నారు.
ఈ సందర్భంగా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్లయిన ఎడబోయిన బస్వారెడ్డి(టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు), జనగామ ఇన్‌చార్జి సాంబారి సమ్మారావు, పరకాల కాంగ్రెస్ ఇన్‌చార్జి బానోతు మోహన్‌లాల్, మహబూబాబాద్ టిడిపి ఇన్‌చార్జి దోపతి దామోదర్‌రెడ్డి, మాజీ డిసిసిబి చైర్మన్, నలుగురు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు, పలువురు మండల పరిషత్ అధ్యక్షులు కూడా తెరాసలో చేరారు.

చిత్రం... ఎర్రబెల్లికి గులాబీ కండువాతో ఆహ్వానం పలికిన కెసిఆర్