తెలంగాణ

రసవత్తర రాజకీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఫిబ్రవరి 23: ఖమ్మం కార్పొరేషన్‌గా అవతరించిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికల్లో అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఖమ్మం మున్సిపాలిటీగా ఉన్న సమయంలో సుదీర్ఘ కాలం పరిపాలించిన సిపిఎం జిల్లాలో బలమైన పార్టీగా ఉన్న తెలుగుదేశం, గత ఎన్నికల్లో తుమ్మలను ఓడించి ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకొని ఖమ్మంలో తాము బలంగా ఉన్నామని చెప్పిన కాంగ్రెస్ పార్టీలు కార్పొరేషన్‌లో మేయర్ స్థానాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అధికార టిఆర్‌ఎస్‌లో ఆశావాహులు అధికంగా ఉండటంతో హైదరాబాద్ ఎన్నికల తరహాలో వ్యూహాన్ని అమలు చేస్తూ ఉపసంహరణ గడువుకు కొద్దిగా ముందు మాత్రమే బి ఫారంలు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి ఎక్కువ మంది అధికార పార్టీలోకి రావడం, వారంతా టిక్కెట్లు ఆశిస్తుండటం, ముందు నుంచి పార్టీలో పనిచేసిన వారు కూడా తమకే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇంటి పోరును తప్పించుకునేందుకు ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా కాంగ్రెస్, టిడిపి,వైకాపా కూడా ఇదే పద్దతిని అవలంభిస్తుండటం గమనార్హం. తమ అభ్యర్థులను అధికార పార్టీ ప్రలోభాలకు గురైతే ఆ డివిజన్లలో తాము ఇబ్బందులు పడుతామనే ఆలోచనలో అధికార పార్టీ వ్యూహానే్న వీరుకూడా అవలంభిస్తుండటం గమనార్హం. 26వ తేదీన ఉపసంహరణ గడువు ముగిసే నాటికి పార్టీ నిర్ణయాలకు విరుద్దంగా బరిలో ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని అన్ని పార్టీలు భావిస్తుండటం గమనార్హం. గెలుపు కోసం అన్ని రాజకీయపక్షాలు ప్రత్యేక వ్యూహాలను రచించి అమలు చేస్తున్నాయి. వైసిపి అధినేత జగన్మోహన్‌రెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబు, పిసిసి అగ్రనేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క, సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడా వెంకటరెడ్డి, టిఆర్‌ఎస్ మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావులు రానున్నారు.