తెలంగాణ

మనదే బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రతీ ఏటా రూ. 20 వేల కోట్లకు పైగా నిధులు విద్యారంగానికి కేటాయిస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న విద్యాసంస్థలు మెరుగైన పద్ధతుల్లో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పేద విద్యార్థులకు ఎల్‌కెజి స్థాయి నుంచి ఉన్నత చదువులు చదువుకోవడానికి అనుగుణంగా విద్యా విధానం ఉండాలని, దానిని పరిగణలోకి తీసుకునే బడ్జెట్ ప్రతిపాదనలు ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. బడ్జెట్ సమీక్షల్లో భాగంగా ముఖ్యమంత్రి మంగళవారం విద్యాశాఖకు బడ్జెట్‌లో కేటాయించాల్సిన నిధులపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, విద్యారంగానికి పెట్టే ఖర్చు కూడా లక్ష్యాన్ని చేరుకునేలా ఉండాలన్నారు. ఆర్థిక స్థోమత కలిగిన వారి పిల్లలు మంచి పాఠశాలలకు వెళ్లి చదువుకుంటారని, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ, ఇతర పేద వర్గాల పిల్లలకు పుస్తకాలు, బట్టలు, మంచి భోజనం సమకూర్చి నాణ్యమైన విద్యను అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పేద విద్యార్థుల చదువుల కోసం పెట్టిన ఖర్చు భావితరాలను బాగు చేయడానికి ఉపయోగపడుతుందని, మానవ వనరుల అభివృద్ధికి దోహదపడుతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బిసి సంక్షేమశాఖ ద్వారా నడుస్తున్న హాస్టళ్లను దశల వారీగా రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చాలని, ఇందుకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ‘విద్యాశాఖలో 14 విభాగాలు ఉన్నాయని, అన్ని అవసరం లేదు, వాటికి అధికారులు కూడా లేరు. అవసరం లేని వాటిని తొలగించాలి. ఒకే స్వభావం ఉన్న విభాగాలను కలిపేయాలి, ఆర్కైవ్స్, గ్రంధాలయాలు వంటి విభాగాలను కల్చరల్ శాఖకు అప్పగించాలి’ అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అన్ని రకాల విద్యాసంస్థలను విద్యాశాఖ పరిధిలోకే తేవాలన్నారు. ఐటిఐని కార్మికశాఖ నుంచి సాంకేతిక విద్యశాఖకు బదిలీ చేయాలి, ఇలా ప్రతీ విభాగం గురించి లోతైన అధ్యయనం చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వారసత్వంగా వచ్చిన ప్రతీ పథకాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదు, తెలంగాణ రాష్ట్రానికి ఏది అవసరమో దానినే కొనసాగించాలి, అవసరం లేని వాటిని రద్దు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విద్యాశాఖలో ప్రచురణల విభాగం నిరర్ధకం, అలాంటి వాటిని తొలగించాలని అని ముఖ్యమంత్రి సూచించారు. పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ప్రస్తుతం ఉన్న విద్యాసంస్థలు ఎన్ని? అవి ఎలా నడుస్తున్నాయి? అనే అంశాన్ని లోతుగా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విద్యాసంస్థలు అత్యున్నతంగా నడించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచించాలని, యూనివర్సిటీలు అంటే ఒకప్పుడు ఎంతో గౌరవం ఉండేదని, కానీ ఇప్పుడు యూనివర్సిటీల వ్యవహారం గందరగోళంగా మారిందని ముఖ్యమంత్రి అన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ విద్య, వివిధ సొసైటీల ద్యారా నడుస్తున్న విద్యాసంస్థలకు సంబంధించిన సమాచారమంతా ఒకే చోట ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రస్తుతం ఉన్న విద్యాసంస్థలు ఎన్ని ఉన్నాయి, వాటికున్న వసతులు ఏమిటీ? అందులో ఎంత మంది అధ్యాపకులు ఉన్నారు, ఎంత మంది విద్యార్థులు ఉన్నారు, ఇంకా ఎంత మంది అవసరం తదితర అంశాలను అధ్యయనం చేయాలని, దీని కోసం ఒక అధికారిని నియమించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ప్రభుత్వ సలహాదారు జిఆర్ రెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ రంజన్ ఆచార్య తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

చిత్రం.. విద్యా శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై ఆ శాఖ మంత్రి, ఉన్నతాధికారులతో సమీక్ష జరుపుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్