తెలంగాణ

మనది రహదారి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రతి శాసనసభా నియోజకవర్గం కేంద్రంలో ఎమ్మెల్యేలకు కార్యాలయాలు నిర్మించాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. వీటిని ఏడాదిలో పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్షలో భాగంగా క్యాంపు కార్యాలయంలో సోమవారం రోడ్లు, భవనాలశాఖ అధికారులతో సమీక్ష జరిపారు. రోడ్లు, భవనాల శాఖ ద్వారా చేపట్టే నిర్మాణాలు ప్రజావసరాలకు తగినట్టుగా శాశ్వత ప్రాతిపదికన, భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలలో రోడ్లు, భవనాల నిర్మాణం కూడా ఒకటని సిఎం స్పష్టం చేశారు. రోడ్లు, భవనాల శాఖ ద్వారా మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ లేన్ల నిర్మాణం, జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి ఫోర్ లేన్ల రోడ్లు, అలాగే ప్రతీ గ్రామానికి కచ్చితంగా ప్రగతి బాట ఉండేలా విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయానికి అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. నదులు, ఉప నదులు, కాలువలపై నిర్మించే బ్రిడ్జిలకు నిధులు కేటాయించడానికి ముందు ఏ సంవత్సరంలో ఎంత పని జరుగుతుందో అంచనా వేసి ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించారు. రాష్టవ్య్రాప్తంగా ప్రజలకు మెరుగైన రోడ్ సౌకర్యం కల్పించడంతో పాటు సామూహిక అవసరాలకు తగినట్టుగా భవన నిర్మాణాలు ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు. రోడ్లు, భవనాల శాఖ ద్వారా చేపట్టే పనులు రెండు, మూడేళ్ల పాటు కొనసాగుతుంటాయని, అలాంటి వాటి విషయంలో ఏ సంవత్సరం ఎంత మేరకు పని జరుగాలో ముందుగానే అంచనా వేసుకుని కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. నిర్మాణాల్లో జాప్యం నివారించాలని, నిర్ణీత వ్యవధిలో నిర్మాణాలు చేపట్టిన వర్కింగ్ ఏజెన్సీలకు 1.5 శాతం ఇనె్సంటివ్ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

చిత్రం... ఆర్ అండ్ బి బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష జరుపుతున్న సిఎం కెసిఆర్