తెలంగాణ

ఖమ్మం, వరంగల్‌కు ఎన్నికల షెడ్యూల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, అచ్చంపేట మున్సిపాలిటీకి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకానుంది. వెంటనే నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 24 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 25న స్కూృటిని, 26న ఉప సంహరణ, మార్చి 6న పోలింగ్ జరుగుతుంది. 9న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన. నోటిఫికేషన్ నుంచి ఫలితాల వరకు 15 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసేలా ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. కొత్త విధానం ప్రకారం జరుగుతున్న తొలి ఎన్నికలివి. మార్చి 10 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగనుండగా, 9న ఫలితాలు వెలువడుతాయి. వరంగల్‌లో తెరాసకు మొదటి నుంచి మంచి పట్టుంది. తెలంగాణ ఆవిర్భావం, తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత ఖమ్మంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అంతకుముందు జిల్లాలో ఒకే ఒక నియోజక వర్గంలో గెలిచిన తెరాస, అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో చొచ్చుకెళ్లింది. తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో తెరాసలో చేరారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఆంధ్రకు చెందిన వారు పెద్ద సంఖ్యలో ఉన్న ప్రాంతాల్లో సైతం తెరాస విజయం సాధించడంతో ఖమ్మంలోనూ ఆ ప్రభావం కనిపించింది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలువురు నేతలు తెదేపా, కాంగ్రెస్‌లకు రాజీనామా చేసి తెరాసలో చేరారు. మున్సిపల్ ఎన్నికలకు అధికార పక్షం కసరత్తు ప్రారంభించగానే ఇతర పార్టీల వారూ తెరాసలో చేరారు. వరంగల్‌లో 58 వార్డులు, ఖమ్మంలో 50 వార్డులున్నాయి. ఈ రెండు మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు మహబూబ్‌నగర్ జిల్లాలోని అచ్చంపేట మున్సిపాలిటీ విజయంపై తెరాస ధీమాగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్, నారాయణఖేడ్ విజయాలతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ తెరాస తన బలాన్ని పెంచుకున్న విషయం స్పష్టమైంది. ఖమ్మంతో అది సంపూర్ణమవుతుందని తెరాస నాయకులు చెబుతున్నారు. ఈ మూడు చోట్ల ఘన విజయం సాధించి అసెంబ్లీ సమావేశాలకు వెళ్తే, విపక్షాలపై మానసికంగా తీవ్రమైన ఒత్తిడి తెచ్చేందుకు అవకాశం ఉంటుందని తెరాస భావిస్తోంది. గత అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత వరంగల్, నారాయణఖేడ్, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిగాయి. వీటన్నింటిలోనూ తెరాస ఘన విజయం సాధించింది. కాంగ్రెస్, తెదేపాలు పూర్తిగా ఢీలాపడిన సమయంలో అసెంబ్లీ సమావేశాల్లో వారికి పెద్దగా వాయిస్ ఉండదని అధికార పక్షం నేతలు అంటున్నారు.