తెలంగాణ

తడారిన తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంచినీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది. జనవరి నాటికే భూగర్భ జల నీటి మట్టం 6.83 అడుగుల నుంచి 24.57 అడుగులకు పడిపోయింది. దీంతో రానున్న మే నెల నాటికి భూగర్భ జలాలు మరింత దిగజారి పోయే ప్రమాదం ఉంది. దీంతో భూగర్భ జలాలపై ఆధారపడిన దాదాపు 10 వేల ఆవాసాలు, శివారు ప్రాంతాలు మంచినీటికి తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొనే పరిస్థితి ఉంది. జనవరిలో ప్రభుత్వం తయారు చేసిన లెక్కల ప్రకారం మెదక్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. భూగర్భజల వనరులు రోజు రోజుకీ పడిపోవడంతో ఈ జిల్లాల్లో మంచినీటి సమస్య జఠిలం కానుంది. తెలంగాణ వ్యాప్తంగా 10 జిల్లాల్లో 23 వేల ఆవాస ప్రాంతాలు ఉంటే వాటిలో కనీసం 10 వేల ఆవాస ప్రాంతాలు తీవ్ర తాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో భూగర్భజలాలపై ఆధారపడి ఉన్న రక్షిత మంచి నీటి పథకాలు, చేతి పంపులకు నీరు అందని పరిస్థితి మార్చి నాటికి తీవ్రమవుతుందని ప్రభుత్వ వర్గాల అంచనా. భూగర్భజలాలు లోతుగా పడిపోవడానికి, తీవ్ర మంచి నీటి ఎద్దడికి కారణం వర్షపాతం గణనీయంగా తగ్గిపోవడమేనని భావిస్తున్నారు. ఈ ఏడాది జనవరి చివరి నాటికి వార్షిక వర్షపాతం బాగా తగ్గిపోయింది. 2015-16 వర్షపాతం జనవరి నాటికి 850 మిల్లీమీటర్లకు బదులు 639 మాత్రమే నమోదైంది. దీంతో ఆరు జిల్లాల్లో వర్షపాతం గత ఏడాదితో పోలిస్తే తగ్గింది. 19 శాతం తగ్గుదల 4 జిల్లాల్లో ఉంటే, 20 నుంచి 50 శాతానికి మిగిలిన జిల్లాల్లో తగ్గుదల నమోదైంది. హైదరాబాద్‌లో -19, నల్గొండ జిల్లాల్లో -17, ఖమ్మంలో -2, నిజామాబాద్ జిల్లాలో -50, మెదక్‌లో -43, రంగారెడ్డి జిల్లాలో -37, మహబూబ్‌నగర్ జిల్లాలో -33, ఆదిలాబాద్ జిల్లాలో -27, కరీంనగర్ జిల్లాలో -27 శాతం చొప్పున వర్షపాతం తగ్గిందని వాతావరణ శాఖ పేర్కొన్న లెక్కలు తెలియజేస్తున్నాయి. అలాగే భూగర్భజల శాఖ జలవనరులను పరిశీలించే 352 మోనిటరింగ్ స్టేషన్ల వద్ద రికార్డు చేసిన మేరకు 103 చోట్ల 13.33 అడుగులకు భూగర్భజలాలు అడుగంటాయని నమోదు అయ్యాయి. 6.67 అడుగుల నుంచి 13.3 అడుగులకు 67 చోట్ల, 6.6 అడుగుల వద్దకు మరో 117 చోట్ల భూగర్భజలాలు పడిపోయినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. భూగర్భజలాలను పరిశీలించిన చోట్లే పరిస్థితి ఇలా ఉంటే పరిశీలన లేని చోట్ల పరిస్థితి ఇంకెలా ఉందోనని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలావుండగా రాష్ట్ర వ్యాప్తంగా తలెత్తుతున్న మంచినీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం రూ.311 కోట్లతో కార్యాచరణ ప్రణాళికను తయారు చేసే పనిలో ఉంది. కాగా తీవ్ర మంచినీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, నల్గొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని 231 కరువు మండలాల్లోని మంచినీటి ఎద్దడి ఉన్న ఆవాస ప్రాంతాలకు మంచినీటిని అందించేందుకు రూ.55 కోట్లను ప్రభుత్వం ఆయా జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే.