తెలంగాణ

వ్యవసాయం పుష్కలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వ్యవసాయ రంగానికి పూర్వ వైభవం తీసుకురావడానికి సరిపడ పరిమాణంలో నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. వ్యవసాయశాఖ అధాయానిచ్చే శాఖ కాదనే అభిప్రాయంతో గత ప్రభుత్వాలు ఈ శాఖకు నిధులు ఇచ్చేవి కావని, అయితే ఎక్కువ మందికి జీవనోపాధి కల్పించేది వ్యవసాయ రంగమే కావడంతో సరిపడినంతగా నిధులు కేటాయించాల్సిందేనని ముఖ్యమంత్రి సూచించారు. బడ్జెట్ రూపకల్పనలపై శాఖల వారీగా జరుపుతున్న సమీక్షల్లో భాగంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు గురువారం వ్యవసాయశాఖకు కేటాయించే నిధులపై సమీక్షించారు. వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఆ శాఖ కార్యదర్శి పార్థసారథి, కమిషనర్ ప్రియదర్శిని, ఆర్థికశాఖ కార్యదర్శులు శివశంకర్, రామకృష్ణారావు తదితరులతో ముఖ్యమంత్రి చర్చించారు. ఎక్కువ మందికి జీవానోపాధిని కల్పించే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి రైతులకు మేలు చేసే పద్ధతులను ప్రవేశపెట్టడానికి వ్యవసాయశాఖ వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి అన్నారు. లక్షలాది మంది రైతులు ఆధారపడే వ్యవసాయశాఖపై అధిక బాధ్యత ఉందని, వ్యవసాయం కోసం భిన్న కోణాల్లో అధ్యయనం చేసి ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. అధిక వర్షాలు పడినప్పుడు ఒకరకంగా, వర్షాలు లేనప్పుడు మరోరకమైన వ్యూహం ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ కోతలు, ఎరువుల కొరత లేకుండా చేశామని, ఇంకా వ్యవసాయ రంగానికి సంబంధించి చాలా చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి అన్నారు. రైతులకు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచడానికి, కల్తీ విత్తనాల బెడద లేకుండా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. వ్యవసాయ విస్తరణ పనులు బాగా జరగాలని, పురుగుల మందుల వాడకాన్ని నియంత్రించాలని, ఆగ్రానమిస్ట్‌ల సంఖ్య పెరగాలని, రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందాలని ముఖ్యమంత్రి అన్నారు. అలాగే క్షేత్రస్థాయిలో వ్యవసాయాధికారులు రైతులకు చెదోడు వాదోడుగా ఉండాలని సూచించారు. అంతర్జాతీయంగా, దేశీయంగా వస్తున్న మార్పులను గమనించి దానికి అనుగుణంగా డిమాండ్‌కు తగినట్టుగా పంటలను సాగు చేసేందుకు రైతులను సన్నద్ధం చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. మార్కెట్ యార్డుల్లో సరుకు తడవకుండా, గిట్టుబాటు ధరలు వచ్చేలా మార్కెటింగ్‌శాఖతో కలిసి పని చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ అంశాలలో ఏమి చేయాలో అధ్యయనం చేసి సరైన విధానాలు తయారు చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి వారసత్వంగా వచ్చిన మూస పద్ధతిలోనే పోకుండా, లోపాలను గుర్తించి శాస్ర్తియ పద్ధతిలో రైతులకు మేలు చేసే విధంగా కార్యాచరణను రూపొందించాలని ముఖ్యమంత్రి వివరించారు. రైతులంతా ఒకే పంట వేయడం వల్ల కూడా నష్టం జరుగుతుందని, మార్కెట్ డిమాండ్‌కు తగ్గట్టుగా పంటలు వేసే విధంగా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. పత్తి ఎగుమతులపై విధించే సుంకం కారణంగా భవిష్యత్‌లో పత్తికి మంచి ధర వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చని, ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలను సూచించాలన్నారు. మొక్కజొన్న, సోయాబీన్ పంటలకు మంచి డిమాండ్ ఉంటుందని ముఖ్యమంత్రి సూచించారు. కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయశాఖకు తక్కువ నిధులు ఉన్నాయని, అయినప్పటికీ కేంద్ర ప్రాధాన్యాలను గమనించి, వాటి నుంచి అధిక నిధులు పొందేవిధంగా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో గ్రీన్ హౌజ్ కల్టీవేషన్ ఎంత మేరకు ఉండాలనే దానిపై ఒక అంచనకు రావాలని ముఖ్యమంత్రి చెప్పారు.

చిత్రం.. వ్యవసాయ బడ్జెట్ ప్రతిపాదనలపై అధికారులతో చర్చిస్తున్న సిఎం కెసిఆర్