తెలంగాణ

కెసిఆర్ చెప్పిన కుండల కథ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 28: హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తామని టిడిపి నాయకులు చంద్రబాబు తదితరులు చేస్తున్న ప్రకటనలపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఆసక్తికరమైన సంఘటన ఒకటి వివరించారు. అదేమిటో ఆయన మాటల్లోనే... ‘అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించడంతో వెళ్లాలని నిర్ణయించుకున్నాను. రాజధాని నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున నిధులు ప్రకటిస్తే బాగుంటుందని కొందరు మంత్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు. నేనూ మంచి కార్యక్రమం.. ప్రకటిస్తేనే బాగుంటుందని అనుకున్నాను. శంకుస్థాపన రోజున వేదికపై నేనుండగా, టేబుల్ పై రెండు కుండలు కనిపించాయి. ఏమిటీ అని తెలుసుకుంటే ప్రధానమంత్రి నీళ్లు, మట్టి తెచ్చారని చెప్పారు. రాజధాని కోసం ప్యాకేజీ ఏమీ ప్రకటించరా? అని అడిగితే లేదని అన్నారు. ప్రధానమంత్రే ఎలాంటి ప్యాకేజీ ప్రకటించకుండా మట్టి కుండ, నీళ్ల కుండ మాత్రమే ఇచ్చినప్పుడు నేను నిధులు ప్రకటిస్తే, నాకన్నా మొనగాడివా? అని మోదీ అనుకుంటారేమో అని నేనూ ఏమీ ప్రకటించలేదు’ అని చెప్పారు. తెలంగాణ భవన్‌లో గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఈ సంఘటనను ఆయన ప్రస్తావించారు.
నాలుగు జిల్లాలుగా హైదరాబాద్
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో హైదరాబాద్‌ను నాలుగైదు జిల్లాలుగా చేయనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. రంగారెడ్డి జిల్లా అలానే ఉంటుంది. కానీ కొన్ని ప్రాంతాలను, హైదరాబాద్‌లోని ప్రాంతాలను కలిపి నాలుగైదు కొత్త జిల్లాలలు ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు.మేయర్ అభ్యర్థి ఎవరు అనేది ఎన్నికల తరువాత పెద్దలు కూర్చోని నిర్ణయిస్తారని అన్నారు. మంత్రివర్గంలో మహిళ లేనందున మేయర్‌గా మహిళను నియమిస్తారా? అని విలేఖరులు ప్రశ్నించగా, మంత్రివర్గంలో మహిళ ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదని కెసిఆర్ తెలిపారు.

భాంజీపేటలో మావోయిస్టు
దంపతుల అంత్యక్రియలు

నర్సంపేట, జనవరి 28: ఒడిశా ఎన్‌కౌంటర్‌లు అసువులు బాసిన మావోయిస్టు దంపతులు పుట్టపాక కుమారస్వామి అలియాస్ సుశీల్, ఆయన భార్య సోనిల అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన వరంగల్ జిలా,్ల నర్సంపేట మండలం, భాంజీపేటల గురువారం సాయంత్రం వేలాది మంది ఆశ్రునయనాల మధ్య జరిగాయి. ఆదివారం ఎన్‌కౌంటర్‌లో కుమారస్వామి దంపతులు మృతిచెందగా వారి భౌతికకాయాలు బుధవారం రాత్రి భాంజీపేటకు చేరుకున్నాయి. గురువారం విప్లవ రచయితల సంఘం జాతీయ నేత పెండ్యాల వరవరరావు కుమారస్వామి, సోని దంపతుల మృతదేహాలపై ఎర్రటి వస్త్రం కప్పి, పూలమాలలు వేసి విప్లవ జోహార్లు అర్పించారు. అంతిమయాత్రలో ఎర్రజెండాలు రెపరెపలాడగా.. అమరులను కీర్తిస్తూ పాడిన పాటలకు జనం కోరస్ కలిపారు. అంతిమయాత్రపై పోలీసులు డేగ కన్ను పెట్టారు. టిఆర్‌ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి కుమారస్వామి, సోని మృతదేహాలపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళి అర్పించేందుకు వచ్చిన సమయంలో కొందరు ప్రజా సంఘాల నాయకులు పెద్ది గోబ్యాక్ అంటూ నినందించారు. ఈ క్రమంలో మరికొంత మంది వారించారు. చివరకు పెద్ది కుమారస్వామి, సోని మృతదేహాలపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.

‘గాంధీ’లో సమ్మె విరమణ
సిఎం కెసిఆర్ హామీతో విధులకు

సికింద్రాబాద్, జనవరి 28: స్థానికేతరులను తరలించాలంటూ గత రెండు రోజులుగా గాంధీ ఆసుపత్రి వైద్యులు చేస్తున్న సమ్మె గురువారం ముగిసింది. తగిన న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇవ్వడంతో ఉద్యోగులు తమ సమ్మెను విరమించారు. ఈ విషయాన్ని తెలంగాణ వైద్య జాక్ చైర్మన్ డాక్టర్ ఉమాశంకర్ ప్రకటించారు. విభజనలో తీవ్ర అన్యాయం జరిగిందని, తెలంగాణ వారిని ఆంధ్రకు, వారిని తెలంగాణ ప్రాంతానికి కేటాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ సిబ్బంది సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. స్థానికేతరులు అక్రమంగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారని తమకు మాత్రం స్వరాష్ట్రం వచ్చినా ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదనను వెళ్లగక్కారు. పారదర్శంగా ఉద్యోగుల విభజనను నిర్వహించి అక్రమంగా తిష్టవేసిన వారిని వెంటనే పంపించివేయాలని డిమాండ్ చేశారు.