తెలంగాణ

ఇక్కడే ఉంటా.. అందరి సమస్యలూ పరిష్కరిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 28: ‘నేను హైదరాబాద్‌లోనే ఉంటాను. టిడిపికి తెలంగాణతో ఉన్న అనుబంధాన్ని ఎవరూ విడదీయలేరు. నేను ఎక్కడికి వెళ్లలేదు. ఇక్కడే ఉంటా.మీతోనే ఉంటా. టిడిపిని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించండి ’ అంటూ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం రాజధానిలో ఎనిమిది చోట్ల నిర్వహించిన రోడ్‌షోలో ప్రజలకు పిలుపునిచ్చారు. టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర విభజన తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు విస్తృత ప్రచారాన్ని ప్రారంభించారు. అన్ని చోట్ల జనం భారీ ఎత్తునే తరలివచ్చారు. రెండు రాష్ట్రాల్లో తెలుగు వారికి ఎప్పుడు, ఎక్కడ ఇబ్బందులు ఎదురైనా అక్కడకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తానని శపథం చేశారు. కాంగ్రెస్‌కు భయపడేది లేదని, అవసరమైతే ఇక్కడే ఉంటానని ఆయన అన్నారు. తాను భయపడ్డానని కొంత మంది కాంగ్రెస్ నేతలు అంటున్నారని, ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, సోనియాగాంధీకే భయపడలేదన్నారు. తనకు ఇక్కడేం పని అని కొందరంటున్నారని, తన రాజకీయ జీవితం ఇక్కడే ప్రారంభమైందని, అవసరమైతే, ఇక్కడే ఉంటానని ఆయన అన్ని రోడ్ షోల్లోనూ చంద్రబాబు పదే పదే ప్రకటనలు చేశారు. హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోయిందని, అంతర్జాతీయ స్ధాయిలో ఈ నగరాన్ని అభివృద్ధి చేసిన ఘనత టిడిపీదేనన్నారు. తాను ఢిల్లీకి ఎప్పుడు వెళ్లినా ఆంధ్రాతో పాటు తెలంగాణ సమస్యలపైన కేంద్రంతో చర్చిస్తుంటానని చెప్పారు. జాతీయ పార్టీ అధ్యక్షుడిగా రెండు రాష్ట్రాల అభివృద్ధిని నిరంతరం పర్యవేక్షించాల్సిన బాధ్యత తనపైన ఉందన్నారు.
అమరావతి శంకుస్ధాపనకు తాను తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఆహ్వానించానని, అలాగే చండీయాగానికి పిలిస్తే వచ్చానని చంద్రబాబు గుర్తు చేశారు. రాజకీయాలు వేరు,ప్రభుత్వపాలన వేరని స్పష్టం స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన జరిగినా, తెలుగు వారందరూ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటానని చెప్పారు. ప్రభుత్వపరమైన విధానాల పరంగా తాను, కెసిఆర్ కలిసి మాట్లాడుకున్నా, చర్చించుకున్నా, రాజకీయంగా విరోధులమని ఉద్ఘాటించారు. అన్నదమ్ములు విడిపోయినా ఆస్తిపంపకాల్లో విబేధాలు సాధారణమేనని, ఇరు రాష్ట్రాలూ శాంతియుత వాతావరణంలో కలిసిమెలిసి ఉండాలన్నదే తమ పార్టీ ఆశయమన్నారు.
గత 12 సంవత్సరాలుగా హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోయిందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో రెండు రాష్ట్రాలకు సమన్యాయం చేయాలంటూ తానొక్కడినే పోరాటం చేశానన్నారు. తెలంగాణ ప్రభుత్వం 26 బిసి కులాలను బిసిల జాబితా నుంచి తొలగించడం అమానుషమన్నారు. తెలంగాణ రాష్ట్రానికి 60 వేల కోట్ల రూపాయల ఆదాయం కేవలం హైదరాబాద్ ద్వారానే వస్తోందన్నారు. తొమ్మిది సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పాలించిన టిడిపి హయాంలో తీసుకున్న చర్యల వల్ల ఇంత భారీ ఆదాయం వస్తోందన్నారు. జంటనగరాల దాహార్తిని తీర్చడానికి సుమారు రూ.700 కోట్ల వ్యయం చేసి కృష్ణా నీటిని హైదరాబాద్‌కు రప్పించామన్నారు. తమకు అధికారం అప్పగిస్తే 2017లోగా మెట్రో రైలు పనులు పూర్తి చేస్తామన్నారు. ఐటి రంగానికి మణిహారమైన హైటెక్ సిటీని ఏర్పాటు చేసి మూడు లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు. తెలంగాణ రైతుల కోసం బాబ్లీ ప్రాజెక్టు విషయమై మహారాష్టత్రో పోట్లాడి జైలుకు కూడా వెళ్లామన్నారు. టిడిపి ప్రజల పక్షాన ఉంటుందే తప్ప వెనకడుగు వేసే ప్రసక్తిలేదన్నారు. తెలుగువారి ఆత్మగౌరవరం, అభివృద్ధి కోసమే టిడిపి ఆవిర్భవించిందన్నారు. పటేల్, పట్వారీ వ్యవస్ధ కబంధ హస్తాల్లో చిక్కుకున్న తెలంగాణకు విముక్తి కలిగించిన పార్టీ టిడిపి అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిన మహానేత ఎన్టీరామారావువారసులు తెలుగు ప్రజలని, టిడిపి-బిజెపి కూటమికి ఓటువేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు నిజాంకు 400 సంవత్సరాలు పడితే, టిడిపి తొమ్మిదేళ్లలో అభివృద్ధి చేసి చూపించిందన్నారు.