తెలంగాణ

ఆర్టీసి లీజు బాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జనవరి 12: ఆదాయమే లక్ష్యంగా..నష్టాల నుండి గట్టెక్కడమే ధ్యేయంగా టిఎస్‌ఆర్టీసి కొత్త మార్గాలను అనే్వషిస్తోంది. సంస్థ పరిధిలోని స్థలాలను లీజుకు ఇవ్వడం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకోవాలని యోచిస్తోంది. నల్గొండ రీజియన్ పరిధిలో ఉన్న ఏడు డిపోల్లో ఇప్పటికే రూ.20కోట్ల మేర నష్టాల్లో ఉండగా మరింత ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్న దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా ఆర్టీసి ఆధీనంలో ఉండి వ్యాపార అవసరాలకు ఉపయోగపడే స్థలాలను లీజుకు ఇవ్వాలని సంస్ధ నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణవ్యాప్తంగా 14 బస్టాండ్‌లను లీజుకు ఇస్తుండగా అందులో తొలివిడతలో రీజియన్ పరిధిలోని మూడు బస్టాండ్‌లను 33ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. బివోటి(బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్) ప్రాతిపదికన ఈస్థలాలను అప్పగించేందుకు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలోని సూర్యాపేట, చౌటుప్పల్, హుజూర్‌నగర్ బస్టాండ్‌లను తొలి విడతను లీజుకు ఇచ్చేందుకు సంబంధించిన ప్రక్రియను ఆర్టీసి అధికారులు సిద్ధం చేస్తున్నారు. మరోపక్షం రోజుల్లో ఇందుకు సంబంధించిన టెండర్‌లను పిలిచేలా ఏర్పాట్లు చేపడుతున్నారు. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వాణిజ్యకేంద్రంగా ఉన్న సూర్యాపేట కొత్తబస్టాండ్‌లోని ఖాళీస్థలాన్ని అద్దెకు ఇస్తే భారీగా ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనావేశారు. సుమారు ఐదేళ్లక్రితమే ఆర్టీసి అధికారులు ఈప్రతిపాదనను సిద్ధం చేసిన వివిధ కారణాల వల్ల కార్యరూపం దాల్చలేదు. అదేవిధంగా జాతీయరహదారిపైనే ఉన్న చౌటుప్పల్ బస్టాండ్ స్థలాన్ని, హుజూర్‌నగర్‌లోని పాత బస్టాండ్ స్థలం పట్టణ నడిబొడ్డున ఉండటంతో ఆస్థలం వ్యాపార అవసరాలకు ఇస్తే భారీ ఆదాయం సమకూరుతుందని భావించి తొలి విడతన వీటిని ఎంపిక చేశారు. టెండర్‌లు పిలిచేందుకు సంబంధించిన కసరత్తును చేపడుతున్నారు. తొలివిడతలో వచ్చిన ఆదాయాన్ని పరిశీలించిన తర్వాత రెండవ విడతలో జిల్లాలోని మరికొన్ని బస్టాండ్‌లను గుర్తించి లీజుకిచ్చే ఆలోచనలో ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మొత్తంగా ఆదాయం పెంచుకునేందుకు సంస్ధ చేపడుతున్న చర్యలు ఏమేరకు ఫలిస్తాయన్నది వేచిచూడాలి.

ఆరు కోట్లతో ఉడాయించిన
చిట్‌ఫండ్ వ్యాపారి
జిల్లా ఎస్పీకి బాధితుల ఫిర్యాదు
నల్లగొండ రూరల్, జనవరి 12: నల్లగొండ పట్టణంలోని శ్రీ ద్వారక సాయి చిట్‌ఫండ్స్, సాయి స్టీల్స్ నిర్వాహకుడు పోతరాజు నర్సింహ తన కస్టమర్లకు చిట్టీల డబ్బు, పొదుపు డబ్బులు ఎగవేసి కనిపించకుండా ఉడాయించాడు. విషయం తెలుసుకున్న బాధితులు మంగళవారం అతడి చిట్‌ఫండ్ వద్ధకు వచ్చి పరస్పరం తామంతా మోసపోయామంటూ గ్రహించి నర్సింహ మోసంపై గగ్గోలు పెట్టారు. చిట్‌ఫండ్ వద్ధకు వచ్చిన బాధితులు వేసిన లెక్కల మేరకు నర్సింహ ఆరుకోట్ల మేరకు వారికి బాకీ ఉన్నట్లుగా తేలిందని, ఇంకా బాధితులంతా బయటకు వస్తే మరో 20కోట్లకు పైగా ఉండవచ్చని బాధితులు తెలిపారు. బాధితులంతా తమకు జరిగిన మోసంపై జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తమకు ఆరుకోట్ల మేరకు నర్సింహ ఎగవేసినట్లుగా వారు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నర్సింహ ఆస్తులు జప్తు చేసి తమకు రావాల్సిన డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని వారు కోరారు. నర్సింహ్మ చిట్‌ఫండ్‌లో మరో స్థానిక న్యాయవాది భాగస్వామిగా ఉన్నాడని వారిద్దరు కలిసి తమను మోసగించారని బాధితులు వాపోయారు. నర్సింహ గత వారం రోజుల కిందనే చిట్టీ పాట వేయాల్సి వుండగా దాటవేయడంతో పాటు ఫోన్ స్విచాఫ్‌లో ఉంచాడని, సోమవారం నుండి అడ్రస్ లేకుండా పోయాడని బాధితులు వెల్లడించారు. నర్సింహ తాను ఉంటున్న ఇంటిని కూడా కుటుంబంతో సహా ఖాళీ చేసి ఉడాయించాడని వారు తెలిపారు. నర్సింహ 30ఏళ్ల నుండి చిట్టీల వ్యాపారం చేస్తుండటంతో తాము అతడిని నమ్మితే ఇప్పుడు నర్సింహ అందరిని నట్టేట ముంచి పారిపోవడంతో తమ బతుకులు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధితులంతా లబోదిబోమన్నారు.