తెలంగాణ

సిఎం వ్యవసాయ క్షేత్రంలో వాటర్ గ్రిడ్ పైపులైన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: మిషన్ భగీరథ పథకం భాగంగా తాగునీటి సరఫరా కోసం పైపులైన్లు వేసే పనులు మెదక్ జిల్లాల్లో చురుకుగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు చెందిన మెదక్ జిల్లా ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం మీదుగా వెళ్లనున్న పైపులైన్ కోసం మంగళవారం తవ్వకం పనులు ప్రారంభం అయ్యాయి. రైట్ ఆఫ్ వే చట్టం ప్రకారం పైపులైన్లను వ్యవసాయ క్షేత్రంలో వేస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి సమాచారం ఇచ్చారు. రైట్ వే ఆఫ్ చట్టానికి ఎవరూ అతీతులు కారని, ముఖ్యమంత్రి అయినా, మరెవ్వరైనా చట్టం ముందు సమానమేనని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దీంతో దాదాపు 300 మీటర్ల పొడవున ముఖ్యమంత్రి వ్యవసాయ క్షేత్రంలో పైపులైన్ వేయడానికి తవ్వి పైపులైన్లు వేశారు. దీంతో పైపులైన్ వెళ్లే మార్గంలో వేసిన అల్లం పంటను అధికారులు తొలగించారు. గోదావరి నది నుంచి నీళ్లు తీసుకరావడానికి వేసిన ఈ పైపులైన్ శివారు వెంకటాపురం నుంచి వరదరాజుపురం వరకు వెళ్తుంది. రైతులైనా, మరెవ్వరైనా ప్రజలకు తాగునీటిని అందించే మిషన్ భగీరథ కార్యక్రమానికి సహకరించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కోరారు. ఈ పథకంలో భాగంగా మొదటి విడతలో ఏప్రిల్ 30 వరకు 10 నియోజకవర్గాలకు తాగునీటిని అందించే లక్ష్యంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంతో పాటు మెదక్ జిల్లాలోని సిద్ధిపేట, దుబ్బాక, వరంగల్ జిల్లా పాలకుర్తి, స్టేషన్ ఘనపూర్, జనగామ, నల్లగొండ జిల్లాలోని భువనగిరి ఆలేరు, తుంగతుర్తి, రంగారెడ్డి జిల్లా మేడ్చల్ నియోజకవర్గాలకు ఏప్రిల్ నెలాఖరు నాటికి తాగునీటిని అందించనున్నారు.