తెలంగాణ

మీవల్లే పేరు రాలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 7: దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుల పంట రుణాలను మాఫీ చేసినప్పటికీ బ్యాంకులు సరిగా వ్యవహరించక పోవడం వల్లే ప్రభుత్వానికి ఆశించిన విధంగా పేరు రాలేదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రుణ మాఫీపట్ల బ్యాంకులు వ్యవహరించిన తీరువల్ల రైతుల నుంచి తమ ప్రభుత్వం నిరసనలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. మూడవ దశ పంట రుణ మాఫీకి ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత కూడా రైతులకు రుణాలివ్వడానికి బ్యాంకులు ఇబ్బంది పెట్టకుండా చూడాలని బ్యాంకర్లను మంత్రి కోరారు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యవసాయమే ప్రధాన ఎజెండాగా ఉందన్న విషయాన్ని బ్యాంకులు దృష్టిలో పెట్టుకోవాలని మంత్రి సూచించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన 9వ రాష్టస్థ్రాయి బ్యాంకర్ల సమావేశాన్ని ఉద్దేశించి మంత్రి ఈటల మాట్లాడారు. రైతులకు రుణాలిచ్చే విషయంలో బ్యాంకులు కఠినంగా వ్యవహరించవద్దని మంత్రి సూచించారు. బ్యాంకులు వ్యాపార దృక్పథంతో కాకుండా సామాజిక బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. బ్యాంకులు ఎల్లప్పుడూ ప్రజల కోణంలో ఆలోచించాలన్నారు. రుణాలు మంజురు విషయంలో అర్హులైన వారికే ఇవ్వాలని, బ్యాంకుల్లో బ్రోకర్ల వ్యవస్థకు స్వస్తి పలకాలని మంత్రి ఈటెల అన్నారు. రుణం తీసుకునే వ్యక్తితో బ్యాంకు మేనేజర్లు నేరుగా మాట్లాడటం వల్ల బ్యాంకులపై ప్రజలలో విశ్వాసం, గౌరవం పెరుగుతుందని మంత్రి సూచించారు. రైతులను విస్మరించకుండానే అణగారిన వర్గాలకు రుణాలు మంజురు చేయటంలో బ్యాంకులు క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. బ్యాంకులకు గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన మేరకు సిబ్బంది లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, అవసరమైన మేరకు సిబ్బందిని నియమించుకోవాలని బ్యాంకర్లను మంత్రి సూచించారు. రాష్ట్ర ఎదుగుదలకు ప్రధానంగా కావాల్సినవి మూడు అంశాలన్నారు. ఒకటి స్థిరమైన ప్రభుత్వం, రెండవది అభివృద్ధిపై అవగాహన ఉండటం, ప్రజల మధ్య అంతరాలను తగ్గించటమని మంత్రి ఈటల అభిప్రాయపడ్డారు. ఈ మూడు అంశాలపట్ల తమ ప్రభుత్వం చిత్తశుద్థితో కృషి చేస్తోందన్నారు. కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న చేపల, పందుల పెంపకం దార్లు, గీతా కార్మికులకు వారి సొసైటీలపరంగా రుణాలు మంజురు చేయాలని బ్యాంకర్లకు మంత్రి సూచించారు. సమావేశంలో రాష్టస్థ్రాయి బ్యాంకర్ల కమిటీ చైర్మన్ శంతన్ ముఖర్జీ, నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ వివివి సత్యనారాయణ, ఆర్‌బిఐ రీజినల్ డైరెక్టర్ ఆర్‌ఎన్ దాసు, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... రాష్టస్థ్రాయి బ్యాంకర్ల సమావేశంలో
మాట్లాడుతున్న ఆర్థిక మంత్రి ఈటల