తెలంగాణ

జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ‘నోటా’?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 6: మహానగర పాలక సంస్థ ఎన్నికల క్షేత్ర స్థాయి ప్రక్రియను కేవలం పదిహేనురోజులకు కుదిస్తూ చట్టసవరణ చేసిన ప్రభుత్వం తాజాగా మరో సవరణకు శ్రీకారం చుట్టింది. పోటీ చేసే అభ్యర్థి తమ నామినేషన్ పత్రంలో పోటీ చేయాలనుకున్న డివిజన్ క్రమ సంఖ్య, పేరు తప్పకుండా పొందుపర్చాలని సర్కారు పేర్కొంది.
అంతేగాక, అభ్యర్థి ఓట ఎక్కడుంది. ఒటరు లిస్టులో పేజీ నెంబర్, వరుస క్రమం సంఖ్యను సైతం తప్పకుండా పొందుపర్చాలని పేర్కొంది. దీనికి తోడు అభ్యర్థిని ప్రతిపాదించే ఓటర్లు కూడా తమ ఓటు ఎక్కడుంది, పోలింగ్ స్టేషన్ నెంబరు, వరుస నెంబర్లను తప్పకుండా పేర్కొనాలని సూచిస్తూ ఈ మేరకు 1955 మున్సిపల్ చట్టంలో మరోసారి సర్కారు సవరణ చేసింది. ఈ నిబంధనలతో ఉన్న చట్టంలోని 40 వ విభాగాన్న ప్రభుత్వం తొలగించింది. దీంతో సెలవురోజుల్లోనూ నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ వంటి కీలకమైన ప్రక్రియలు చేపట్టేందుకు వీలుగా ప్రభుత్వం సవరణలు చేసింది.
కొద్దిరోజుల క్రితం సర్కారు చేసిన సవరణల ప్రకారం సెలవురోజుల్లో నామినేషన్ల ప్రక్రియ చేపట్టరాదన్న నిబంధనకు సర్కారు మినహాయింపునిస్తూ తాజాగా ఈ సవరణ చేపట్టింది. ఇదిలా ఉండగా, మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘నోటా’ ఆప్షన్ బటన్‌ను పొందుపర్చాలని సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం. బరిలో నిల్చిన అభ్యర్థుల్లో ఎవరికి తాను ఓటు వేయటం లేదని చెప్పేందుకే ఈ బటన్. ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని సర్కారు నిర్ణయం తీసుకుంటే మున్సిపల్ చట్టంలో మరో సవరణ చేయాల్సిందే!