తెలంగాణ

‘క్యాట్ ఫిష్’ మాఫియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామగుండం, జనవరి 6: అది కరీంనగర్ జిల్లా రామగుండం మండలంలోని బ్రాహ్మణపల్లి, కొత్తపల్లి గ్రామాలు మానవాళికి ప్రాణాంతకమైన క్యాట్‌ఫిష్ చేపల పెంపకానికి కేంద్రంగా మారాయ...బ్రాహ్మణపల్లి, గ్రామ శివారులోని దట్టమైన అటవీ ప్రాంతం... అంగబలమున్న నేతల అండదండలతో ఏడాదికాలంగా కొనసాగుతోంది ఈ అక్రమ వ్యవహారం సర్పంచ్ భర్త భూమిలోనే క్యాట్‌ఫిష్ పెంపకం దందా... ప్రభుత్వం నిషేధించినా ఏకంగా సుమారు కోటి రూపాయల విలువగల క్యాట్‌ఫిష్‌ల చేపలను ఇక్కడ పెంచుతున్నారు. అదేవిధంగా రహదారికి పక్కనున్న కొత్తపల్లి గ్రామంలో సైతం ఈ దందా గత ఏడాది కాలంగా నిరాఘాటంగా కొనసాగుతోంది. ఇక్కడ పెంచుతున్న క్యాట్‌ఫిష్‌లను కర్నాటక రాష్ట్రంలోని బెంగుళూర్, మహారాష్టల్రోని నాగపూర్, చంద్రాపూర్‌తో పాటు పశ్చిమబెంగాల్‌కు రవాణా చేస్తున్నారు. రామగుండం మండలం అంతర్గాం గ్రామానికి చెందిన ఓ చేపల వ్యాపారి ఇందుకు సూత్రధారిగా వ్యవహరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యక్తులతో క్యాట్‌ఫిష్ వ్యాపారాన్ని నడిపిస్తున్నట్లు సమాచారం. అయితే ఆంధ్రప్రదేశ్‌లో క్యాట్‌ఫిష్‌ల పెంపకం సాధ్యంకాకపోవడం, అక్కడ నిఘా విపరీతంగా ఉండడంతో తెలంగాణలోని రామగుండం మండలం ప్రాంతాన్ని ఎన్నుకున్నట్లుగా నిర్వాహకులు పేర్కొనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 1997 ఎన్విరాన్‌మెంట్ చట్టం ప్రకారం 2000 సంవత్సరంలోనే ప్రాణాంతకమైన క్యాట్‌ఫిష్ చేపల పెంపకాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. క్యాట్‌ఫిష్‌లు తినడం వల్ల మెదడు, లివర్‌కు సంబంధించిన వ్యాధులు సంభవించడంతో పాటు క్యాన్సర్ కూడా వస్తుందన్న భయంతో ప్రభుత్వం ఈ పెంపకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు విడుదల చేయడంతో పాటు పెంపకందారులపై కఠినమైన చట్టపరమైన చర్యలను కూడా సిద్ధం చేసింది. కోళ్లు, మేకల కళేబరాలు, మాంసపు వ్యర్థపదార్థాలను ఆహారంగా పెడుతూ సుమారు 5 ఎకరాల స్థలంలో ఈ చేపల పెంపకాన్ని నిరాఘాతంగా కొనసాగిస్త్తున్నారు. పాలవాగుకు వెళ్లే నీళ్లను కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా పైపులతో అడ్డుకట్ట వేసి భారీ మోటార్ల ద్వారా క్యాట్‌ఫిష్‌ల చెరువులకు నీటిని అక్రమంగా తరలించుకుంటున్నారు.
పోలీస్‌ల అదుపులో నలుగురు
బ్రాహ్మణపల్లి శివారు ప్రాంతంలో అక్రమంగా క్యాట్‌ఫిష్‌లను పెంపకం చేస్తున్నారన్న సమాచారం మేరకు మత్స్య శాఖ అధికారులు దాడి జరిపి చెరువును ఆధీనంలోకి తీసుకుని నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మంథని డివిజన్ మత్స్య శాఖ అధికారి విజయ్‌కుమార్ తెలిపారు.
బ్రాహ్మణపల్లి క్యాట్‌ఫిష్ ముఠా అరెస్టు
ప్రభుత్వం నిషేధించిన క్యాట్‌ఫిష్‌ను పెంచుతున్న ముఠాలోని నలుగురు వ్యక్తులను బుధవారం అరెస్టు చేసినట్లు రామగుండం ఎస్‌ఐ విద్యాసాగర్ తెలిపారు. అరెస్టయిన వారిలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం చెరుకువాడ గ్రామానికి చెందిన జయమంగళ నర్సయ్య, గోదావరి జిల్లా ఏలూరు మండలం పార్తికొల్లంక గ్రామానికి చెందిన జయమంగళ మురళి, రామగుండం పట్టణం భరత్‌నగర్‌కు చెందిన గొట్టిపర్తి శ్రీనివాస్, రామగుండంనకు చెందిన గంటశాల నాగరాజును అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.