తెలంగాణ

‘ఔటర్’లో మరో ఘోరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/రాజేంద్రనగర్, నవంబర్ 29: ఔటర్ రింగ్‌రోడ్డు మరోసారి రక్తసిక్తమయ్యింది. కుటుంబ సమేతంగా ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి అమాంతం రోడ్డు అవతలి వైపు ఎగిరి పడింది. ఎదురుగా వస్తున్న మరో కారును వేగంతో ఢీకొట్టింది. ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతిచెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. శేరిలింగంపల్లి ప్రాంతానికి చెందిన గీతారాణి (45) తన పెద్ద కుమార్తె పిల్లల నూతన వస్త్రాలంకరణ కార్యక్రమం గుంటూరు జిల్లా అద్దంకిలో నిర్వహించేందుకు నిశ్చయించారు. కాగా ఈ శుభకార్యానికి శేరిలింగంపల్లి నుంచి గీతారాణి బంధువులు విజయ్‌కుమార్ (26), తనూజ (40), పూజ (18)తో కలిసి ఎస్టీమ్ కారు (ఏపి 9బిఎం 5752)లో వెళ్లారు. శుభకార్యం ముగిసిన అనంతరం శనివారం మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఆదివారం తెల్లవారుజామున హిమాయత్‌సాగర్ సనా ఫంక్షన్‌హాల్ సమీపంలోకి రాగానే కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. కారు అనంతరం గాల్లోకి ఎగిరి అవతలి రోడ్డుపై పడింది. అదే సమయంలో గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌కు వెళ్తున్న షఫీ (50) భార్య, ఇద్దరు పిల్లలతో కలిసివస్తున్న కారును ఢీకొట్టింది. గీతారాణి, విజయ్‌కుమార్, తనూజ అక్కడికక్కడే కారులో ఇరుక్కుపోయి మృతిచెందగా పూజకు తీవ్ర గాయాలయ్యాయి. మరో కారులో ఉన్న షఫీ కుటుంబ సభ్యులు కూడా గాయపడ్డారు. తోటి ప్రయాణికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులు పూజ, షఫీ, షఫీ భార్య, ఇద్దరు పిల్లలను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో పూజ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా షఫీ కుటుంబం పరిస్థితి విషమంగా ఉంది.
గీతారాణికి బంధువైన విజయ్‌కుమార్ మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. మృతిచెందిన ఇద్దరు శేరిలింగంపల్లికి చెందినవారు. కాగా తనూజ మెదక్ జిల్లా మంచవరం గ్రామవాసి. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న పూజ, గీత అక్క కూతురు శేరిలింగంపల్లిలో ఉంటోంది. ప్రమాదానికి కారణం అధిక వేగం, నిద్ర అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు