తెలంగాణ

మళ్లీ.. మేళా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: తెలంగాణ రాష్ట్రంలో మరో వెయ్యి పోస్టుల భర్తీకి ప్రభుత్వం మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వ్యవసాయ శాఖ, భూగర్భ జలవనరుల శాఖల్లో 1069 ఖాళీలను నేరుగా నియమించడానికి ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఖాళీల భర్తీ బాధ్యతను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్‌కు అప్పగించింది. వ్యవసాయ శాఖలో వ్యవసాయ విస్తరణ అధికారి గ్రేడ్ 2 పోస్టులు 1000 భర్తీ చేస్తారు. అసిస్టెంట్ జియోఫిజిస్ట్‌లు-2, అసిస్టెంట్ కెమిస్ట్-1, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (మెకానికల్)-1 అసిస్టెంట్ హైడ్రాలజిస్టు - 37, అసిస్టెంట్ ఇంజనీర్స్ (సివిల్)-10, టెక్నికల్ అసిస్టెంట్ జియోఫిజిక్స్ -6, టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రాలాజి)-12 భర్తీ చేస్తారు. ఈ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్వరలో చర్యలు తీసుకుంటుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూలు త్వరలో విడుదల కానుంది.