తెలంగాణ

ఇక్కడి వారికి కరోనా లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 17: తెలంగాణలో ఉన్న వారెవరికీ ఇప్పటివరకు కరోనా సోకలేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులతో మం గళవారం ఆయన ఇక్కడ మాట్లాడు తూ, ఇప్పటివరకు కరోనా పాజిటివ్ వ చ్చినవారు ఐదుగురని, వీరంతా ఇతర దేశాల నుండి వచ్చిన వారేనని తెలిపారు. ఒకరు దుబాయి నుండి, రెండో వ్యక్తి ఇటలీ నుండి, మూడో వ్యక్తి నెదర్లాండ్స్ నుండి, నాలుగో వ్యక్తి స్కా ట్లాండ్ నుండి వచ్చిన వారని, తాజాగా ఐదో వ్యక్తి ఇండోనేషియా నుండి వచ్చిన వ్యక్తి అని మంత్రి వివరించా రు. ఇప్పటి వరకు హైదరాబాద్ విమానాశ్రయానికి వచ్చిన 66,182 మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించగా, వీరిలో 464 మందిని అనుమానంతో ఐసోలేషన్ వార్డులో ఉంచి సమగ్ర పరీక్షలు నిర్వహించగా, ఐదుగురికి కరో నా సోకినట్టు తేలిందన్నారు. అనుమా నం ఉన్న వారిలో 221 మందిని క్వా రంటైన్ కేంద్రాలకు తరలించామని వివరించారు. విదేశాల నుండి వస్తున్న వారిని విమానాశ్రయాల్లోనే పూర్తిగా ప రీక్షించాలని కేంద్ర ప్రభుత్వానికి సూ చించామని మంత్రి ఈటల తెలిపారు.
అఫ్గనిస్తాన్, మలేషియా, యూకే, ఫిలిప్పీన్స్ నుండి వచ్చే విమానాలను నిలిపివేసేలా చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. బుధవారం నుండి మరికొన్ని దేశాల నుండి వచ్చే విమానాలను నిలిపివేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల నుండి వచ్చిన వారికి వ్యాధి లక్షణాలు లేకపోయినా క్వారంటైన (ఏకాకి)
చేస్తున్నామన్నారు. చైనా, ఇరాన్, ఇటలీ, జర్మనీ, కొరియా, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల నుండి వచ్చిన వారిని ఐసోలేట్ చేస్తున్నామన్నారు. బుధవారం నుండి యూఏఈ, ఖతర్, ఒమన్, కువైట్ దేశాల నుండి వచ్చేవారిని క్వారంటైన్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. విదేశాల నుండి వస్తున్న కొంతమంది తమ తమ ఇళ్లల్లోనే ప్రత్యేక గదుల్లో ఉంటూ అవసరమైన చర్యలు తీసుకుంటామని అడుగుతున్నారని, ఈ అంశంపై ఆలోచిస్తామని మంత్రి చెప్పారు. ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణలోకి వచ్చే ప్రతిమార్గంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. విదేశాల నుండి వస్తున్న తెలంగాణ వాసులు ఏ జిల్లాకు చెందితే ఆ జిల్లాలోనే క్వారంటైన్ చేయాలని ఆలోచన చేస్తున్నామని ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో మొదటి ముగ్గురితో కలిసిన 199 మందికి పూర్తిగా పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్ వచ్చిందని మంత్రి తెలిపారు. నాలుగో వ్యక్తితో కలసిన 11 మందికి, ఐదో వ్యక్తితో కలిసిన మరో 11 మందికి పరీక్షలు నిర్వహించామని నివేదికల కోసం వేచి ఉన్నామని తెలిపారు. వరంగల్, గాంధీ, ఉస్మానియా, ఫీవర్, ఐపీఎం, ఎంజీఎంతో పాటు నిమ్స్‌లో కూడా లేబొరేటరీని సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలిపారు. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పరీక్షల కోసం ఆరు లేబోరేటరీలు సిద్ధంగా ఉన్నట్టు అయిందన్నారు.
భయం వద్దు
దూలపల్లి, వికారాబాద్‌లో ఉన్నవారు కరోనా పేషంట్లు కాదని, అందువల్ల ఆయా ప్రాంతాల్లో ధర్నా చేస్తున్న ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని మంత్రి ఈటల స్పష్టం చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉంటే చాలని అన్నారు. బాధ్యత గల నేతలు ఇలాంటి సమయంలో ప్రజలను భయపెట్టకూడదన్నారు. ప్రజలకు అండగా ప్రభుత్వం ఉంటుందని ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా ప్రకటించారని, ఎంత డబ్బు ఖర్చయినా భరిస్తామంటూ వెల్లడించారని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన ఐదుగురికి గాంధీలో చికిత్స చేస్తున్నామని, వీరిలో ఒకరిని డిశ్చార్జి చేశామని, మిగతా వారికి వైద్య చికిత్స అందిస్తున్నామని అన్నారు.

*చిత్రం...మీడియా సమావేశంలో మాట్లాడుతున్న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్